దేవుడా.. తనపై ఒక మహిళ అత్యాచారం చేసిందని కేసు పెట్టిన డిగ్రీ విద్యార్థి..

ఒక యువకుడిపై అత్యాచారం చేసి అతడిని వేధింపులకు గురి చేస్తుందని ఒక యువకుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.ఈ ఫిర్యాదు తెలిసి మన దేశంలో సమాజం ఎటు పోతుందో అర్ధం కావడం లేదని కొంత మంది వాపోతున్నారు.

 Degree Student Filed A Rape Case On 45 Years Old Woman, Crime News,degree Studen-TeluguStop.com

దేశంలో ఆడవాళ్లకే రక్షణ లేకుండా పోతుందని బాధపడుతుంటే ఇప్పుడు మగవాళ్ళు కూడా బాధితులుగా మారడం కలవరపాటుకు గురి చేస్తుంది.

ఆ యువకుడు మైనర్ గా ఉన్నప్పుడే అతడిపై అత్యాచారానికి పాల్పడి ఇప్పుడు నేరుగా తన ఇంటికే వెళ్లి ఆ యువకుడి తల్లిదండ్రులతో మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి జరిపించాలని లేకపోతే మీ అబ్బాయి మీద తప్పుడు కేసులు పెట్టించి జైల్లో పెట్టిస్తానని వాళ్ళను బెదిరించింది.

ఈ విషయం పోలీసులకు చెప్పి ఆ మహిళపై కేసు పెట్టాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.సిద్దార్థ్ నగర్ జిల్లాలో మొమైన ఖతూన్(45) అనే మహిళా నివసిస్తుంది.

ఆమె నివసిస్తున్న ఇంటి పక్కన ఒక టీచర్ ట్యూషన్ చెప్తూ ఉండేవాడు.ఆ ట్యూషన్ కి 9 వ తరగతి చదువుతున్న విద్యార్థి పై ఆమె కన్ను పడింది.

అతడిపై లైంగికంగా దాడి చేసి ఎవరికీ చెప్పొద్దని బెదిరించింది.అలాగే కొన్నాళ్ల పాటు అతడిపై లైంగికంగా దాడి చేసింది.

ఈ ఘటన జరిగి నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది.ప్రస్తుతం ఆ యువకుడు డిగ్రీ చదువుతున్నాడు.అయితే గత సంవత్సరం డిసెంబర్ లో ఆ మహిళ ఆ యువకుడి ఇంటికి వెళ్లి ఆమె కూతురిని ఇచ్చి ఆ యువకుడితో పెళ్లి చేయాలనీ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది.అయితే వారు ఇందుకు ఒప్పుకోలేదు.

మా అబ్బాయి ఇంకా చిన్న వాడని ఇంకా చదువుకోవాలని చెప్పడంతో ఆమె వారిని బెదిరించింది.

పెళ్ళికి ఒప్పుకోకపోతే మీ అబ్బాయిని ఏదొక కేసులో ఇరికించి జైలుకు పంపిస్తానని బెదిరించడంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

తనకు ఏమీ తెలియని వయసులో లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ నన్నే బెదిరిస్తుందని కేసు పెట్టడంతో పోలీసులు పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube