'సలార్' మంత్ షురూ.. ట్రైలర్ ఫీస్ట్ తో బిగిన్!

”సలార్” మంత్ స్టార్ట్ అయ్యింది.ఈ రోజు డిసెంబర్ 1 కావడంతో ఇంకా ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు కేవలం 22 రోజులు మాత్రమే ఉంది.

 December Month Start For Prabhas-starrer Salaar Madness, Salaar Movie , Pr-TeluguStop.com

ఈ రోజు నుండి మేకర్స్ ప్రమోషన్స్ కూడా షురూ చేసేందుకు భారీ ప్లాన్స్ చేసారు.ఒక ప్లానింగ్ ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ స్టార్ట్ చేయనున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) లైనప్ లో కీలకమైన ప్రాజెక్ట్ ఉన్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఏది అంటే ‘‘సలార్”.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ రిలీజ్ కు సిద్ధం అయ్యింది.ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.

ఈ రోజు నుండి ‘సలార్’ మంత్ స్టార్ట్ అవ్వడంతో ముందుగా ఫ్యాన్స్ అంత ఎదురు చూసే అప్డేట్ ట్రైలర్.ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 1 న రిలీజ్ చేయనున్నట్టు ఎప్పుడో తెలిపారు.ఈ రోజు సాయంత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసి డైనో సలార్ మంత్ బిగిన్ చేస్తుండగా ట్రైలర్ తర్వాత ఈ సినిమా విషయంలో మరింత ఎగ్జైటింగ్ గా మారే అవకాశం ఉంది.

కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.మరి ఇదైనా డార్లింగ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube