నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) నిన్న దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా లో కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది.ఈ సినిమా కోసం దంచవే మేనత్త కూతురా పాటను రీమిక్స్ చేయడం జరిగింది.
సినిమా విడుదల సమయంలో ఒక పాట ఉంది.దానిని సినిమా విడుదల అయిన వారం రోజుల తర్వాత సినిమా కు యాడ్ చేయబోతున్నట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు.
సినిమాలో వచ్చే ఆ పాట బాలయ్య అభిమానులకు రెట్టింపు ఉత్సాహం ఇవ్వడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.
ఇలాంటి సమయంలో సినిమా లో ఆ పాటను పెట్టేందుకు సరైన సమయం లేదు… సరైన ప్లేస్ లేదు.కనుక సినిమా నుంచి దాన్ని తొలగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇంకా యాడ్ చేయకుండానే దాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు.
సినిమా ఇప్పుడు సరిగ్గా ఆడుతోంది.ఇలాంటి సమయంలో డిస్ట్రబ్ చేయడం ఎందుకు అనుకుని దర్శకుడు అనిల్ రావిపూడి( Director Anil Ravipudi ) ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడు అంటున్నారు.
సినిమా లో బాలయ్య మరియు కాజల్ మధ్య ఆ పాట పెట్టేంత రొమాన్స్ మరియు లవ్ లేదు.
కనుక పాట పెడితో ఓవర్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు అనేది మరి కొందరి అభిప్రాయం.మొత్తానికి బాలయ్య యొక్క సినిమా లో దంచవే మేనత్త కూతురా పాట ఉండబోదు అంటూ తేలిపోయింది.ఇలాంటి పాటలు సినిమాకు హైప్ ను తీసుకు వస్తాయి.
అప్పటికే విడుదల అయిన సినిమాకు ఆ పాట వల్ల వచ్చే క్రేజ్ ఏమీ లేదు.అందుకే పాట విడుదల విషయం లో అనిల్ రావిపూడి ఈ నిర్ణయం తీసుకున్నాడు.
సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలో అయినా ఈ పాట ని యాడ్ చేస్తారేమో చూడాలి.