తమిళనాడులో దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీ..!!

తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఇళయ దళపతి విజయ్ జోసెఫ్( Joseph vijay ) రాజకీయ పార్టీని ప్రకటించనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు మరో నెల రోజుల్లో ఆయన కొత్త పార్టీని ప్రకటిస్తారని సమాచారం.

 Dalapati Vijay's New Political Party In Tamil Nadu, Joseph Vijay, Lok Sabha Elec-TeluguStop.com

రానున్న లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా విజయ్ పార్టీని పెట్టబోతున్నారని సమాచారం.ఇప్పటికే ఈ వ్యవహారంపై చెన్నైలోని అభిమానులతో దళపతి చర్చించారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సుమారు 150 మంది జిల్లా స్థాయి ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.హీరోగానే కాకుండా దళపతి పలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారన్న సంగతి తెలిసిందే.

కాగా ఆయన ప్రస్తుతం ‘గోట్ ’ చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ మరో నెలరోజుల్లో పూర్తికానుండగా కొత్త పార్టీ ఏర్పాటుపై ఫోకస్ పెట్టనున్నారని సమాచారం.అలాగే విజయ్ మక్కల ఇయక్కం( Vijay Makkala Iyakkam ) పేరిట ముందుగా రిజిస్ట్రేషన్ అయిందని తెలుస్తోంది.తమిళనాట సినీ, రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉన్న నేపథ్యంలో విజయ్ కొత్త పార్టీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube