తమిళనాడులో దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీ..!!

తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఇళయ దళపతి విజయ్ జోసెఫ్( Joseph Vijay ) రాజకీయ పార్టీని ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు మరో నెల రోజుల్లో ఆయన కొత్త పార్టీని ప్రకటిస్తారని సమాచారం.

రానున్న లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా విజయ్ పార్టీని పెట్టబోతున్నారని సమాచారం.

ఇప్పటికే ఈ వ్యవహారంపై చెన్నైలోని అభిమానులతో దళపతి చర్చించారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే సుమారు 150 మంది జిల్లా స్థాయి ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.

హీరోగానే కాకుండా దళపతి పలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారన్న సంగతి తెలిసిందే.

"""/" / కాగా ఆయన ప్రస్తుతం ‘గోట్ ’ చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ మరో నెలరోజుల్లో పూర్తికానుండగా కొత్త పార్టీ ఏర్పాటుపై ఫోకస్ పెట్టనున్నారని సమాచారం.

అలాగే విజయ్ మక్కల ఇయక్కం( Vijay Makkala Iyakkam ) పేరిట ముందుగా రిజిస్ట్రేషన్ అయిందని తెలుస్తోంది.

తమిళనాట సినీ, రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉన్న నేపథ్యంలో విజయ్ కొత్త పార్టీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ప్రధాని మోడీకి పెళ్లి ఆహ్వానం అందించిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఫోటో వైరల్!