యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ ఏడాది నిరాశ మిగిలిందనే సంగతి తెలిసిందే.దేవర సినిమా ఈ ఏడాదే థియేటర్లలో రిలీజవుతుందని ఫ్యాన్స్ భావించగా ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
అయితే దేవర ఈ ఏడాది రిలీజ్ కాకపోయినా నవంబర్ నెల 18వ తేదీన తారక్ నటించిన అదుర్స్ రీరిలీజ్ కానుంది.నేడు భగవంత్ కేసరి థియేటర్లలో విడుదలవుతుండగా తెలుగు రాష్ట్రాల్లోని 400 థియేటర్లలో అదుర్స్ రీ రిలీజ్ టీజర్ ప్రదర్శితం కానుంది.
అయితే దగ్గుబాటి హీరో దగ్గుబాటి అభిరామ్( Abhiram Daggubati ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి, ఇతర హీరోల గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ గారు హార్డ్ వర్కింగ్ మ్యాన్ అని పవన్ పాలిటిక్స్ లో దిగి ప్రజల కోసం ఫైట్ చేస్తున్నారని అభిరామ్ అన్నారు.
పవన్ నటించిన గోపాలగోపాల సినిమా( Gopala Gopala )కు ఎగ్జిక్యూటిక్ ప్రొడ్యూసర్ గా పనిచేశానని అభిరామ్ పేర్కొన్నారు.తేజ గారు తిడతారు కొడతారని అందరూ అంటారని తప్పు చేస్తే ఇంట్లో వాళ్లు కూడా తిడతారని కొడతారని అభిరామ్ పేర్కొన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) జెమ్ అని అభిరామ్ వెల్లడించారు.మహేష్ బాబుతో నేను ఎప్పుడూ కలిసి పని చేయలేదని మహేష్ బాబు గుడ్ పర్సన్ అని అభిరామ్ పేర్కొన్నారు.ఆయన డౌన్ టు ఎర్త్ ఉంటారని అభిరామ్ చెప్పుకొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్, పర్ఫామెన్స్ కు హ్యాట్సాఫ్ అని అభిరామ్ కామెంట్లు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ ను కలిసినప్పుడు బాగా మాట్లాడతానని ఆయన అన్నారు.
చిన్నప్పుడు సినిమాల్లోకి వస్తున్నా.నేను కూడా దిగుతాను.అప్పుడు చెబుతా నీ సంగతి అంటూ తారక్( Junior ntr ) కు సరదాగా వార్నింగ్ ఇచ్చానని అభిరామ్ పేర్కొన్నారు.
అప్పుడు అలా చెప్పడంతో తారక్ ఇప్పుడు నన్ను ఎగతాళి చేస్తాడని అభిరామ్ చెప్పుకొచ్చారు.అరే భయమేస్తుందిరా.నువ్వు దిగావు ఇండస్ట్రీలోకి.నన్ను పంపించేస్తావు ఇంటికి అని తారక్ సరదాగా చెబుతాడని అభిరామ్ కామెంట్లు చేశారు.