రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )ముస్తాబాద్ మండల్ భవన నిర్మాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముస్తాబాద్ శ్రీకృష్ణ యాదవ సంఘంలో న్యాక్ సెంటర్ లో లేబర్ కార్డు( Labor Card ) ఉన్న వారికి తాపీ మేస్త్రి కార్పెంటర్ ప్లంబర్ పెయింటర్ మొదటిది రెండవది శిక్షణ తరగతులు ముగిసాయి మూడవ శిక్షణ తరగతులు మొదలు కాపాడుతున్నాయి కాబట్టి శిక్షణ నేర్చుకునే వారు ఈనెల 20 తేదీలోగా లేబర్ కార్డు ఆధార్ కార్డ్ ఒక ఫోటో న్యాక్ సెంటర్లో ఫామ్ ఫిల్ అప్ చేసుకొని దరఖాస్తు ఇవ్వగలరు.
ఈ అవకాశం మరల కావాలన్నా మన ముస్తాబాద్ లో నిర్వహించలేరు కాబట్టి లేబర్ కార్డు ఉన్న ప్రతి కార్మికుడికి ఇది చివరి అవకాశం కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించి కోగలరు మరల శిక్షణ తరగతులు తీసుకోవాలంటే సిరిసిల్లలో న్యాక్ సెంటర్ పెడతారు సిరిసిల్లలో పోవడానికి రావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మన ముస్తాబాద్ లోనే శిక్షణ ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచించి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు దయచేసి ఆలోచించి అర్థం చేసుకొని ఈ శిక్షణ 15 రోజులే కానీ మన జీవితానికి టికెట్ ఎన్నో రకాల ప్రభుత్వ స్కీం లకు కేంద్ర ప్రభుత్వం( Central Govt ) పెట్టే స్కీములకు ఈ భవానిర్మాణ రంగాలలో పనిచేసే ప్రతి కార్మికుడికి ఈ సర్టిఫికెట్ ఉంటే వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది 18 నుంచి 45 సంవత్సరాల వయసుగల వారు 1978 డిసెంబర్ లోపు పుట్టిన ప్రతి కార్మికుడికి ఈ అవకాశం ఉంది ఆలోచించి అర్థం చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని తెలిపారు.