క్రిక్ Qatar 19వ టోర్నమెంట్ ఇటీవలే ప్రారంభం కాగా క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోయింది.ఖతార్ రాజధాని దోహాలో హార్డ్ టెన్నిస్ బాల్‌తో ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు.
ఈ వన్డే టోర్నమెంట్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఉంటే అవి కంటిన్యూగా జరుగుతాయి.దీనివల్ల క్రీడా అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది.
Cric Qatar ఛైర్మన్, వ్యవస్థాపకులు సయ్యద్ రఫీ తాజాగా ఈ టోర్నమెంట్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.తాము ప్రతి టోర్నమెంట్‌ను వివిధ లెవల్స్‌లో అద్భుతంగా కండక్ట్ చేయడం వల్ల ఒక గొప్ప ఎక్స్‌పీరియన్స్ లభిస్తుందని ఆయన అన్నారు.
హెల్దీగా ఉండాలంటే ఆటలు ఆడాల్సిన అవసరం ఎంత ఉందని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.సాయంత్రం వేళ చీఫ్ గెస్ట్‌గా హాజరైన తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు గద్దె శ్రీనివాస్ ఈ టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలను అందజేశారు.
అంతేకాకుండా ఆయన టోర్నమెంట్లు, లీగ్ మ్యాచ్‌లను చాలా చక్కగా నిర్వహించినందుకు సయ్యద్ రఫీ సేవలను మెచ్చుకున్నారు.ఇకపోతే 19వ క్రికెట్ టోర్నీలో ఎన్నారైలు పాటిస్పేట్ చేశారు.దీనిని సమర్ధవంతంగా నిర్వహించడంలో సహకరించిన మహమ్మద్ ఇర్ఫాన్‌కు సయ్యద్ రఫీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక క్రికెట్ వివరాల విషయానికి వస్తే.ఛాంపియన్‌షిప్ లాస్ట్ మ్యాచ్ గోల్డెన్ స్టార్ క్రికెట్ క్లబ్, QTSP టీమ్స్ నడుమ చాలా హోరా హోరీగా జరిగింది.ఈ ఛాంపియన్‌షిప్ పోరులో గోల్డెన్ స్టార్ క్రికెట్ క్లబ్ QTSP టీమ్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది.
ఈ వన్డే టోర్నమెంట్‌లో ఐదు కంటే ఎక్కువ టీమ్స్ పాల్గొన్నాయి.