ఆరవ జ్యోతిర్లింగంపై నెల‌కొన్న వివాదం ఇదే... మ‌హారాష్ట్ర‌, అసోంలు ఏమంటున్నాయంటే...

దేశంలో మ‌హాశివుని ప్ర‌తిబింబాలుగా వెలుగొందుతున్న‌ జ్యోతిర్లింగాలు భారతదేశాన్ని ఆధ్యాత్మికతో ముంచెత్తుతున్నాయి.వాటిలో ఒకటి మహారాష్ట్రలో ఉన్న భీమశంకర్ జ్యోతిర్లింగం.

 This Is The Dispute Over The Sixth Jyotirlinga Bhimshankar Jyotirlinga Details,-TeluguStop.com

పూణేలోని సహ్యాద్రి ప్రాంతంలో ఉన్న భీమశంకర దేవాలయం గురించిన వర్ణన శివపురాణంలో ఉంది.దీంతో పాటు, శంకరుని భీమశంకర జ్యోతిర్లింగం రామాయణ కాలం అంటే త్రేతా యుగం నాటిద‌ని కూడా చెబుతారు.

రావణుని సోదరుడు కుంభకర్ణుడి భార్య కర్కటి గర్భం నుండి భీమ‌ అనే రాక్షసుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.బ్రహ్మదేవుని నుండి వరం పొందిన తరువాత, అతను దేవతలను హింసించడం ప్రారంభించాడు.

దీంతో దేవతలు శివుని ఆశ్రయాం పొందార‌ట‌.అప్పుడు శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై భీమ‌ను సంహరించాడ‌ని చెబుతారు.దీని తరువాత ఈ జ్యోతిర్లింగం భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింద‌ని అంటారు.

భీమశంకర జ్యోతిర్లింగానికి ప్ర‌త్యేక గుర్తింపు

పురాణాల్లో పేర్కొన్న వివరాల ప్ర‌కారం పూణేలో భీమ‌ అనే రాక్షసుడిని చంపిన తరువాత, శంకరుడు ఇక్కడ మోటేశ్వర్ మహాదేవ్‌గా నివసించాడు.సూర్యుని మొదటి కిరణాలు ప‌డే స‌మ‌యంలో ఈ ఆలయాన్ని సందర్శించి, 12 జ్యోతిర్లింగాల పేర్లను జపించిన ఏ భక్తునికైనా ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని ఈ ఆలయానికి సంబంధించిన పురాణాల‌లో పేర్కొన్నారు.శ్రావ‌ణ‌ మాసంలో ఈ జ్యోతిర్లింగ నామాన్ని జపించడం వల్ల శివుడు సంతోషిస్తాడని నమ్ముతారు.

Telugu Jyotirlingas, Assam, Jyotirlinga, Maha Shivaratri, Maharashtra-Latest New

శివునికి సంబంధించిన‌ ఈ జ్యోతిర్లింగం పూణే నుండి 120 కి.మీ దూరంలో దట్టమైన అడవులలో ఉంది.భీమశంకరుని ఆలయం 1200 సంవత్సరాల పురాతనమైనది అని చెబుతారు.భీమశంకరుని ఆలయ శిఖరం అనేక రకాల రాళ్లతో నిర్మిత‌మ‌య్యింది.ఈ ఆలయాన్ని నగారా శైలిలో నిర్మించారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఉత్తర భారత హిందూ వాస్తుశిల్పంలోని మూడు శైలులలో నాగరా శైలి ఒకటి.

Telugu Jyotirlingas, Assam, Jyotirlinga, Maha Shivaratri, Maharashtra-Latest New

ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం చాలా పెద్దది.మందంగా ఉంటుంది, అందుకే ఈ ఆలయాన్ని మోటేశ్వర్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు.మహారాష్ట్రలోని భీమశంకర్ జ్యోతిర్లింగానికి చేసే పూజలు మరియు అభిషేకాలు ఎప్పుడూ విఫలం కావు అని భ‌క్తులు నమ్ముతారు.ఈ ఆస్థానం నుండి ఏ శివభక్తుడు నిరాశతో తిరిగి వెళ్ల‌డ‌ని అంటారు.ఎందుకంటే మహాదేవుడు తన భక్తుల‌ను రక్షించడానికి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడ‌ని చెబుతారు

ఆరవ జ్యోతిర్లింగానికి సంబంధించిన వివాదం ఇదే.

ఆరవ జ్యోతిర్లింగానికి సంబంధించిన ఒక‌ వివాదం ఉంది.దీని వెనుక అసోం ప్రభుత్వ ప్రకటన ఉంది.ఆరవ జ్యోతిర్లింగం అసోం ఉందని పేర్కొన్నారు.అస్సాంలోని కమ్రూప్‌లోని డాకిని కొండలపై ఆరవ జ్యోతిర్లింగం ఉందని అసోం ప్రభుత్వం పేర్కొంది.అయితే ఈ వాదన మహారాష్ట్రకు ఆమోదయోగ్యం కాలేద‌ని స‌మాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube