ఏపీలో అవినీతి బాగా పెరిగిపోయిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.పెట్టుబడులు సైతం రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని చెప్పారు.
ఏపీ నుంచి ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీపడి అప్పులు చేస్తున్నారని విమర్శించారు.
ఏపీలో జసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని తెలిపారు.తెలంగాణలో సొంతంగా పోటీ చేసి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలమైన శక్తిగా మారుతుందని స్పష్టం చేశారు.