ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఎంతగా కలకలం సృష్టిస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు.దీంతో కొన్ని ఆసుపత్రులు కరోనా వైరస్ కి చికిత్స అందిస్తామని చెప్పుకుంటూ ప్రజలకు తప్పుదోవ పట్టిస్తూ క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి.
తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన టువంటి ఓ వైద్యుడు తన వద్ద కరోనా వైరస్ ని నాశనం చేసే మందు తన దగ్గర ఉందని ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్ర రాజధాని అయినటువంటి చెన్నై నగరంలో ఓ వైద్యుడు ఆసుపత్రిని నడుపుతున్నాడు.
కాగా ఇతడు ఈ మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ని పూర్తిగా అరికట్టేందుకు తన వద్ద అవసరం ఔషధం ఉందంటూ ప్రచార కార్యక్రమాలను చేపట్టాడు.అంతేగాక సోషల్ మీడియాలో పలు ప్రకటనలు కూడా చేస్తున్నాడు.
దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకుతూ చివరికి చెన్నై పోలీసుల వరకూ చేరింది.దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి చెన్నై పోలీసులు వైద్యుడిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కరోనా వైరస్ మహమ్మారికి మందు కనిపెట్టామని వస్తున్నటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదని కాబట్టి వీటిని ఎవరు నమ్మద్దని అంటూ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.ఒకవేళ కరోనా గురించి ఎటువంటి తప్పుడు ప్రచారాలు, అసత్య వార్తలు వినిపించినా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందివ్వాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.