గుడ్ న్యూస్ : వలస కూలీలకి ఆ ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుంది..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా లాక్ డౌన్ విధించడంతో పనుల నిమిత్తమై ఇతర ప్రాంతాలకు వెళ్లి నటువంటి వలస కార్మికులు, ఉద్యోగులు వంటి వారు తమ సొంత గ్రామాలకు చేరుకోలేక పోయారు.

 Ap Government,  Other State Workers, 500 Rupees To Workers, Ys Jagan Mohan Reddy-TeluguStop.com

దీంతో తిండి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం గురించి కీలక నిర్ణయం తీసుకుంది.

పనుల నిమిత్తమై ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రాష్ట్రంలో నివాసం ఉన్నటువంటి వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు చర్యలు తీసుకోనుంది.ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 500 రూపాయలు దారి ఖర్చులు నిమిత్తమై ఇస్తూ, రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో వలస కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ  నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.అయితే వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు ప్రయాణించాలంటే ముందుగా పలు వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగా ప్రయాణించే వారికి కరోనా వైరస్ లక్షణాలు సోకినట్లయితే ఆ వ్యక్తులని ప్రయాణం చేయడానికి అనుమతించరు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు చేపడుతూ మద్యం అమ్మకాలకు అనుమతులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇటు ప్రతిపక్షాలు, మరోవైపు ప్రజా సంఘ నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక మద్యం కోసం కొన్ని ప్రాంతాల్లో మందుబాబులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్న సంఘటనలు కనబడుతుండడంతో ప్రజలు సామాజిక దూరం మరిచి మద్యం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కాబట్టి మద్యం అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వానికి కొందరు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube