రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాప్తిస్తోంది.మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది.
కొన్ని రాష్ట్రాల్లో రోజుకు పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.కరోనా ఎవరిని వదిలిపెట్టడం లేదు.
సామాన్య ప్రజల నుంచి అధికారుల వరకు ఈ వైరస్ బారిన పడుతున్నారు.ఇమ్యూనిటీ లేని వాళ్లు మరణిస్తున్నారు.
కరోనాతో ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు, అధికారులు సైతం వైరస్ బారిన పడుతున్నారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీకి కరోనా సోకింది.
ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది.ఆయనతో పాటు అతని కుటుంబ సభ్యులు, ఇంట్లో పనివాళ్లతో సహా 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వినిపిస్తున్నాయి.
డ్రైవర్ల, ఇద్దరు గన్ మెన్లకు కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది.గత కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధ పడుతున్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ స్థానిక ఆస్పత్రి కరోనా యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు జరుపుకున్నాడు.
పాజిటివ్ గా నమోదవడంతో ప్రస్తుతం ఆయనతో పాటు అతని కుటుంబసభ్యులు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు.అలాగే టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేత ఐన లక్ష్మణ్ కుటుంబానికి పాజిటివ్ వచ్చింది.
పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పాజిటివ్ రావడంతో టీఆర్ఎస్ పార్టీలో కరోనా కలవరం రేపుతోంది.