ఈ నాలుగు ర‌కాల‌ డ్రై ఫ్రూట్స్‌ను పాల‌తో క‌లిపి తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

డ్రై ఫ్రూట్స్ కాస్త ఖరీదైనవే అయినా అందుకు తగ్గా పోషక విలువ‌లు వాటిలో నిండి ఉంటాయి.అందుకే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను కలిగిస్తాయి.

 Consuming These Four Types Of Dry Fruits With Milk Has Many Health Benefits, Dry-TeluguStop.com

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ ను పాలతో కలిపి తీసుకుంటే మీరు ఊహించని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ ఏంటి.? వాటిని పాలతో ఏ విధంగా కలిపి తీసుకోవాలి.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు బాదం పప్పులు, ఐదు ఎండు ద్రాక్షలు, ఐదు జీడిపప్పులు వేసుకుని వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టుకున్న జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు, పొట్టు తొలగించిన బాదం పప్పులు మిక్సీ జార్‌లో వేసుకోవాలి.వాటితో పాటు ఐదు పిస్తా పప్పుల‌ను కూడా వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ పాలను పోయాలి.పాలు కాస్త మ‌రిగిన అనంత‌రం అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, అర స్పూన్ యాల‌కుల పొడి వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.

చివ‌రిగా వ‌న్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకుని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ మిల్క్ సిద్ధమవుతుంది.సూప‌ర్ టేస్టీగా ఉండే ఈ డ్రైఫ్రూట్స్ మిల్క్ ను రోజుకు ఒకసారి తీసుకోవాలి.

జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్షలు, పిస్తా పప్పు.ఈ నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ ను పైన చెప్పిన విధంగా పాలతో కలిపి తీసుకుంటే మెదడు పనితీరు చురుగ్గా సాగుతుంది.జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.ఒత్తిడి దూరం అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లభిస్తుంది.

ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

రాత్రుళ్లు నిద్ర సైతం బాగా పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube