తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు.తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కర్ణాటక నేత డీకే శివకుమార్ వచ్చే అంశంపై ఏఐసీసీ పెద్దలదే తుది నిర్ణయమని తెలిపారు.
దేశంలో ఉన్న కాంగ్రెస్ కీలక నేతలు అందరూ తెలంగాణకు వస్తారని మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు.బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మిత్రులన్న ఆయన రెండు పార్టీలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
పేదలకు విస్మరించి కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసమే పని చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ సీనియర్ నేతలకు వివిధ పార్టీల నేతలు టచ్ లో ఉన్నారని వెల్లడించారు.