టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ ఉన్నారు.ఒకానొక సమయంలో బ్రహ్మానందం ఆలీ వంటి వారు టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన కమెడియన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో వందల సినిమాలలో నటించి విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక ప్రస్తుతం వీరి వయసు పైబడటంతో బ్రహ్మానందం వంటి వారు పూర్తిగా సినిమాలను తగ్గించారు.ఇక ప్రస్తుత కాలంలో యంగ్ జనరేషన్ లో ఉన్నటువంటి కమెడియన్లలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వెన్నెల కిషోర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
వెన్నెల కిషోర్ ప్రతి ఒక్క యంగ్ హీరో సినిమాలలో సందడి చేస్తూ మంచి గుర్తింపు పొందారు.ఇలా ప్రతి ఒక్క సినిమాలోని ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి వెన్నెల కిషోర్ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వెన్నెల కిషోర్ ఒక్కో సినిమాకు ఏ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు అనే విషయానికి వస్తే ఈయన ఒకరోజు సినిమా షూటింగ్లో పాల్గొంటే సుమారు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
వెన్నెల కిషోర్ సినిమా కమిట్ అయ్యేముందే రెమ్యూనరేషన్ ఫిక్స్ అవుతారని అలాగే ఇది కేవలం సినిమాలో నటించిన దానికి మాత్రమేనని ఈయన ఈ రెమ్యూనరేషన్ తోనే ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనని ముందుగానే ఆగ్రిమెంట్ కుదుర్చుకుంటారని తెలుస్తోంది.సినిమాలో చేసినందుకు ఒక రెండు రోజులు ఉచితంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నప్పటికీ అనంతరం ఈయన సినిమా ప్రమోషన్ లో పాల్గొంటే తప్పనిసరిగా రెమ్యూనరేషన్ చెల్లించాల్సిందేనని తెలుస్తోంది.రెమ్యూనరేషన్ విషయంలో వెన్నెల కిషోర్ చాలా కమర్షియల్ గా ఉంటారనేది ఇండస్ట్రీ టాక్.
ఏది ఏమైనా ఒక రోజు కాల్ షీట్ కోసం వెన్నెల కిషోర్ ఏకంగా ఆరు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారంటే మామూలు విషయం కాదని చెప్పాలి.