ప్రపంచంలోనే “అత్యంత అందమైన పోలీసు”గా పిలిచే డయానా రామిరేజ్ ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యింది.ఈ అందమైన ముద్దుగుమ్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నారు.
సోషల్ మీడియాలో ఆమె ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరాల్లో ఒక మహిళా పోలీసు అధికారి ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తారో కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది.ఆమె పాపులర్ అయినా, నేరాలకు వ్యతిరేకంగా పోరాడటం కోసం మోడల్ లేదా ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యే అవకాశాన్ని వదులుకుంటానంటోంది.నల్లటి జుట్టు గల ఈ బ్యూటిఫుల్ పోలీస్ ఆఫీసర్ ఇటీవల ఇన్‌స్టాఫెస్ట్ అవార్డ్స్‌లో “బెస్ట్ పోలీస్ లేదా మిలిటరీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్”గా నామినేట్ అయింది.
“ఈ నామినేషన్‌తో పోలీసు బలగాలకు ప్రాతినిధ్యం వహించడం నాకు గౌరవంగా ఉంది” అని డయానా పేర్కొంది.“నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే సోషల్ మీడియా ప్రతిరోజూ పని చేసే ప్రతి ఒక్కరి పని.అంకితభావాన్ని చూపుతుంది.మెరుగైన దేశాన్ని నిర్మించడంలో దోహదపడుతుంది.” అని ఆమె అన్నది.కొలంబియాలోని మెడెలిన్‌లో ఈ మహిళా పోలీసు అధికారి విధులు నిర్వర్తిస్తోంది.
అయితే అప్పుడప్పుడు ఆమె షేర్ చేసే మోడర్న్, హాట్ ఫోటోలు చూసి ఫిదా అవుతున్నారు.బ్యూటీ విత్ బ్రెయిన్ అని పొగుడుతున్నారు.ఏదేమైనా ఆమె మోడలింగ్ రంగంలో రాణించడం పెద్ద కష్టమేమీ కాదని తెలిసిపోయింది.
అయినా కూడా పోలీస్ వృత్తికే తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పింది.ఎంతో అందరూ ఆమె అంకిత భావాన్ని, ప్రజల రక్షణ కోసం పాటుపడతానని చెప్తున్న ఆమె గొప్ప మనసుని పొగుడుతున్నారు.