తహశీల్దార్,కార్యాలయ సిబ్బంది పని తీరుపై కలెక్టర్ ఆగ్రహం

యాదాద్రి భువనగిరి జిల్లా:రాజాపేట తహశీల్దార్, సీనియర్ అసిస్టెంట్ తీరుపై జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే( Collector Hanumantu K.

 Collector Is Angry With The Work Of Tahsildar And Office Staff-TeluguStop.com

Jendage ) ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం రాజాపేట తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి,ధరణి పెండింగ్ పైల్స్, ఆఫిస్ రికార్డులను పరిశీలించి, రిజిస్ట్రేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్ విజిట్ చేసిన సమయంలో గైర్హాజరైన తహశీల్దార్ దామోదర్ పనితీరుపై,సీనియర్ అసిస్టెంట్ యాదగిరి పట్ల అసహనం వ్యక్తం చేశారు.

ధరణి ఫైల్స్ ( Dharani files )ను వెంటనే క్లియర్ చేయాలని, మండలంలో ఆక్రమణకు గురైతున్న కుంటలు,చెరువుల స్థలాలను వెంటనే తనిఖీ చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి,ఆర్ఐ సలీం, సీనియర్ అసిస్టెంట్ యాదగిరి, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube