తహశీల్దార్,కార్యాలయ సిబ్బంది పని తీరుపై కలెక్టర్ ఆగ్రహం

యాదాద్రి భువనగిరి జిల్లా:రాజాపేట తహశీల్దార్, సీనియర్ అసిస్టెంట్ తీరుపై జిల్లా కలెక్టర్ హనుమంతు కె.

జెండగే( Collector Hanumantu K.Jendage ) ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం రాజాపేట తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి,ధరణి పెండింగ్ పైల్స్, ఆఫిస్ రికార్డులను పరిశీలించి, రిజిస్ట్రేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్ విజిట్ చేసిన సమయంలో గైర్హాజరైన తహశీల్దార్ దామోదర్ పనితీరుపై,సీనియర్ అసిస్టెంట్ యాదగిరి పట్ల అసహనం వ్యక్తం చేశారు.

ధరణి ఫైల్స్ ( Dharani Files )ను వెంటనే క్లియర్ చేయాలని, మండలంలో ఆక్రమణకు గురైతున్న కుంటలు,చెరువుల స్థలాలను వెంటనే తనిఖీ చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి,ఆర్ఐ సలీం, సీనియర్ అసిస్టెంట్ యాదగిరి, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

అప్పుడు రజనీ ఫ్యాన్.. ఇప్పుడు రజనీనే మెచ్చుకున్నాడు.. ప్రభాస్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!