Cm Kcr: ఉప్పల్ రోడ్డు మనమే వేద్దాం..కేంద్రానికి చేతకాదు.!

ఉప్పల్ రోడ్డును కేంద్రం వేయదని మనమే వేసుకుందామని సీఎం కేసీఆర్( Cm Kcr ) అన్నారు.ప్రజల వాహనదారుల అవస్థలను తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలిపారు.

 Cm Kcr Lets Build The Uppal Road Ourselves-TeluguStop.com

ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనుల జాప్యం మీద కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు.

Telugu Centrol, Cm Kcr, Palli, Narendra Modi, Telangana, Ts, Uppal Road, Vemulap

ఐదేళ్ల కిందట శంకుస్థాపన చేసినటువంటి ఉప్పలు,నారపల్లి ( Uppal-Narapalli ) ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు.మేడ్చల్ జిల్లా ఉప్పల్ మరియు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం కోసం వరంగల్ జాతీయ రహదారి ( Warangal National Highway ) పై చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు చాలా స్లోగా సాగుతున్నాయి.ఇది పూర్తయిన తర్వాత నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ యొక్క రోడ్డును ఆధునికరించాల్సి ఉంటుంది.

కానీ కారిడార్ పనులు ఐదు సంవత్సరాలైనా పూర్తి చేయకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సందర్భంలోనే మంత్రి మల్లారెడ్డి, ఫిర్యాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్( Cm Kc ) ను కలిసి రోడ్డు పరిస్థితిని వివరించి ఒక వినతి పత్రం అందించారు.

Telugu Centrol, Cm Kcr, Palli, Narendra Modi, Telangana, Ts, Uppal Road, Vemulap

దీనిపై వెంటనే స్పందించినటువంటి కేసీఆర్ (Cm Kcr) వాహనదారుల సౌకర్యం కోసం కారిడారుకు రెండువైపులా నాణ్యమైన బీడీ రోడ్డును వేయాలని ఆర్ అండ్ బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి( Vemula Prashanth Reddy ) కి ఆదేశాలు జారీ చేశారు.దీనికోసం ఎన్ని నిధులైన సరే రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వీలైనంత త్వరగా ఈ రోడ్డును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube