వరద బాధితులకు పదివేల రూపాయలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన..!!

దేశవ్యాప్తంగా భారీ ఎత్తున వర్షాలు( Heavy Rains ) కురుస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా ఢిల్లీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి.

 Cm Arvind Kejriwal's Sensational Announcement Of Rs 10,000 For Flood Victims, Aa-TeluguStop.com

గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో వర్షాలు కురుస్తూ ఉండటంతో.జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది.ఆగకుండా వర్షాలు పడుతూ ఉండటంతో యమునా నది( Yamuna River )లో ప్రమాద స్థాయి నీటిమట్టం 206.02 మీటర్లకు చేరుకుంది.ఈ క్రమంలో వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal ) ఆర్థిక సహాయం ప్రకటించారు.ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

ముఖ్యంగా యమునా నది ఒడ్డున బ్రతుకుతున్న పేదవాళ్లు నష్టపోవడంతో పాటు విలువైన ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డులు కొట్టుకుపోయిన నేపథ్యంలో వారి కోసం ప్రత్యేకమైన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.బట్టలు అదేవిధంగా స్కూల్ యూనిఫారం( School Uniform ) పోయిన విద్యార్థులకు పాఠశాల తరఫున మళ్లీ అందేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు.ఇదిలా ఉంటే యమునా నది పొంగటానికి ప్రధాన కారణం హర్యానాలో బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ బ్యారేజ్( Hathni Kund Barrage ) వదలటమే అని.ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.ఏది ఏమైనా గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు.ఇటువంటి పరిస్థితులలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆర్థిక సాయం ప్రకటన వరద బాధితులలో కొంత ధైర్యం కలిగించినట్లు అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube