థియేటర్ లో సినిమాను రికార్డ్ చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్.. జైలు శిక్షతో పాటు ఆ డబ్బు కట్టాలంటూ?

మాములుగా అభిమానులు, ప్రేక్షకులు సినిమాకు వెళ్ళినప్పుడు థియేటర్ లలో సినిమాలను వీడియోలు( Movies Videos ) తీసి స్టేటస్ లో పెడుతూ ఉంటారు.కొన్ని సన్నివేశాలు,పాటలు, హీరోల ఎంట్రీ సన్నివేశాలు రికార్డ్ చేసి వాటిని స్టేటస్ లలో పెట్టుకోవడం అన్నది కామన్.

 Cinematography Bill Passes Big Punishment Over Recording In Theaters, Cinematogr-TeluguStop.com

మల్టీప్లెక్సుల యాజమాన్యాలు కొంత వరకు కట్టడి చేయగలుగుతున్నాయి కానీ పూర్తిగా కాదు.ఇక సింగల్ స్క్రీన్ల సంగతి సరేసరి.

కానీ ఇకపై ఇలా రికార్డు చేసేటప్పుడు చట్టాన్ని దృష్ఠిలో ఉంచుకోక తప్పదు.సినిమా థియేటర్ లలో మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫోన్లు పట్టుకుని వీడియోల రికార్డ్ చేస్తూనే ఉంటారు.

అయితే అటువంటి వారికి ఒక షాకింగ్ న్యూస్ ఎందుకంటే ఇవాళ రాజ్యసభ కీలక బిల్లుని పాస్ చేసింది.

Telugu Big, Cinematography, Theaters-Movie

సినిమాటో గ్రఫీ( Cinematography ) బిల్లులోకి కొన్ని కీలక సవరణలు తీసుకొస్తూ ఆమోదం ఇచ్చింది.వాటి ప్రకారం ఇకపై థియేటర్ లో ఏ రూపంలో అయినా కెమెరాతో రికార్డింగ్ చేయడం శిక్షార్హం.ఒకవేళ దీన్ని మీరితే మూడేళ్ళ జైలు శిక్షతో పాటు నిర్మాణం ఖర్చులో 5 శాతాన్ని కట్టాల్సి ఉంటుంది.

అంటే అయిదు కోట్లలో తీసిన ఒక సినిమాను రికార్డు చేస్తే 25 లక్షలు ఫైన్ పడుతుందన్న మాట.ఇది నిజంగానే వణికించే విషయమే.అయితే హాలుకు వచ్చే వందలాది ఆడియన్స్ లో ఒకరో ఇద్దరో చేస్తే పట్టుకోవచ్చు కానీ అందరూ తెగబడినప్పుడు నలుగురైదురు సెక్యూరిటీతో వాళ్ళను పట్టుకోవడం జరగని పని.కాకపోతే థియేటర్ బయట బోర్డు పెట్టడం ద్వారా ముందే హెచ్చరిక ఇవ్వచ్చు.అయితే దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.

Telugu Big, Cinematography, Theaters-Movie

అయితే దీని వల్ల పైరసీకి ( piracy )అడ్డుకట్ట పడుతుందా అంటే చెప్పలేం.ఎందుకంటే అధిక శాతం ఈ భూతం విదేశాల నుంచి వస్తోంది.అక్కడి చట్టాలను అడ్డం పెట్టుకుని వాటి సృష్టికర్తలు దొరక్కుండా తప్పించుకుంటున్నారు.

అందుకే నిర్మాతలు సైతం ఏమి చేయలేని నిస్సహాయతలో మిగిలిపోయారు.ఇప్పుడీ బిల్లు వల్ల సామాన్యులు జాగ్రత్తగా ఉంటారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఎందుకంటే పోలీస్ కేస్ అవుతుందని తెలిసినపుడు తాత్కాలిక ఆనందం కోసం రికార్డింగ్ ఎందుకు చేస్తారు.దీని వల్ల సోషల్ మీడియా గోల కూడా తప్పవచ్చు.

మరి ఈ విషయంపై ప్రేక్షకులు, హీరోల అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube