ఏబీసీడీ డైరెక్టర్ రెమో డిసౌజాకి గుండెపోటు

సినిమా ఇండస్ట్రీలో ఉండే వారు ఎక్కువగా హిజ్ ప్రెజర్ లో పని చేస్తూ ఉంటారు.అందరికంటే ఎక్కువగా కష్టపడేది ఇండస్ట్రీలో ఉండే టెక్నీషియన్స్, నటులు అనే విషయం చాలా మందికి తెలియదు.

 Choreographer-director Remo D'souza Suffers Heart Attack, Tollywood, Bollywood,-TeluguStop.com

ఒక సినిమా పెర్ఫెక్షన్ కోసం ఎంత సమయం అయినా వర్క్ చేస్తారు.బయటకి సినిమా అంటే రంగుల ప్రపంచం కనిపిస్తుంది.

కోట్ల ఆదాయం వస్తుందని, విలాసాలలో బ్రతుకుతారని అందరూ భావిస్తూ ఉంటారు.అయితే ఏ పనిలో అయినా మహా అయితే పది నుంచి పన్నెండు గంటలు మాత్రమే పని చేస్తారు.

కానీ ఇండస్ట్రీలో మాత్రం ఒక్కోసారి 24 గంటలు కూడా రెప్ప వాల్చకుండా పని చేస్తూ ఉంటారు.అంత కష్టంలో కూడా వారికి సంతృప్తి దొరికేది సినిమా థియేటర్ లోకి వచ్చి సూపర్ హిట్ అని ప్రేక్షకులతో అనిపించుకున్న తర్వాతనే.

ఈ ఒత్తిడి కారణంగా చాలా మంది దర్శకులు, నటులు చాలా చిన్న వయస్సులోనే గుండెపోటుకి గురవుతూ ఉంటారు.కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోతారు.అలాగే ఈ ఒత్తిడి కారణంగానే కొంత మంది సెలబ్రెటీలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు.ఇలాంటివి చూసినపుడు సినిమా ఇండస్ట్రీ అనేది పూలపాన్పు కాదనే విషయం చాలా మందికి అర్ధమవుతుంది.

తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డిసౌజా గుండెపోటుతో హాస్పిటల్ లో చేరారు.ఎన్నో హిట్ సినిమాలకి కొరియోగ్రాఫర్ గా పని చేసిన రెమో డిసౌజా దర్శకుడుగా ఏబీసీడీ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అలాగే డాన్స్ రియాలిటీ షోలకి జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు.ఆయనకి గుండెపోటు వచ్చిన వెంటనే ఆయనను ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ కు తరలించారు.

వైద్యులు ఆయనకు యాంజియోగ్రఫీ చేశారు.ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube