చిరంజీవి రికార్డులు చూసి.. వేర్ ఇస్ అమితాబ్ అన్న బాలీవుడ్ మీడియా.. అసలేం జరిగిందంటే?

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సరికొత్త ట్రెండ్ సృష్టించిన హీరో.అంతేకాదు కృషివుంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు అనే పదానికి చిరంజీవి నిలువెత్తు నిదర్శనం.

 Chiranjeevi Records In Bollywood With State Rowdy Details, Megastar Chiranjeevi,-TeluguStop.com

ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏకచక్రాధిపత్యం కొనసాగించిన ఘనత చిరంజీవి సొంతం.ఇక ఇప్పుడు అంటే సీనియర్ హీరోగా మారిపోయాడు.

అయినా చిరంజీవి సినిమాలు భారీగా వసూళ్లు సాధిస్తున్నాయ్.ఒకప్పుడు చిరంజీవి సినిమాలు వసూళ్లతో రికార్డులు బద్దలు కొట్టేవి.

ఇక టాలీవుడ్ లో వచ్చిన రికార్డులు అటు బాలీవుడ్లో సైతం షేక్ చేసేవి.కేవలం నేటి రోజుల్లో మాత్రమే టాలీవుడ్ సినిమాలు వసూళ్లలో బాలీవుడ్ ను భయపెడుతున్నాయి అని అంటూ ఉంటారు.

కానీ ఒకప్పుడు చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు బాలీవుడ్ను షేక్ చేసాయ్ అని చెప్పాలి.ఇలాంటి సినిమానే స్టేట్ రౌడీ.1989లో ఇదే నెలలో ఈ సినిమా విడుదలైంది.మొదట ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.

కానీ ఆ తర్వాత ఊహించని రీతిలో ఈ సినిమా రికార్డు సృష్టించింది.ఈ సినిమా కంటే ముందు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనే సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది.

దీంతో ఇక అటు బయ్యర్లు కూడా ఈ సినిమాను కొనేందుకు ఎంత రేట్ పెట్టడానికైనా సిద్ధమైపోయారు.కానీ మొదటి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.కానీ నెమ్మదిగా పుంజుకొని ఇక రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించడం చూసి అందరూ ఆనందంలో మునిగిపోయారు.చిరు స్టేట్ రౌడీ సినిమా కి అటు బాలీవుడ్ సినిమా లెవెల్లో అప్పట్లో వసూలు వచ్చాయట.

కేవలం ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా కోటి రూపాయల వసూళ్లు సాధించదట.ఈ వసూళ్లతో అటు బాలీవుడ్ కూడా షేక్ అయింది.ఈ క్రమంలోనే ఒక ముంబై మ్యాగజైన్ వేర్ ఇస్ అమితాబ్ అనే ఆర్టికల్ కూడా ప్రచురితం చేసింది.ఎంతో సక్సెస్ఫుల్గా 100 రోజులు పూర్తి చేసుకుని చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.

Chiranjeevi Records In Bollywood With State Rowdy Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube