మెగాస్టార్ చిరంజీవి.స్వయం కృషితో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన చిరంజీవి ఇక తక్కువ సమయంలోనే ఏకంగా మెగాస్టార్ గా మారిపోయారు అన్న విషయం తెలిసిందే ఒక సాదా సీదా నటుడు స్థాయి నుంచి స్టార్ హీరో రేంజికి ఎదిగారు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎలాంటి సపోర్ట్ లేకుండా కేవలం ఆయన సొంత టాలెంట్ తోనే ఏకంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కొనసాగించే స్థాయికి ఎదిగారు అని చెప్పాలి.అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ డాన్స్ లూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాయ్.
నిజంగా చెప్పాలంటే అటు మెగాస్టార్ కు దీటుగా డాన్స్ లూ చేసి ప్రేక్షకులను అలరించే హీరోయిన్ అప్పట్లో చాలా తక్కువగా కనిపించేవారు అని చెప్పాలి.కానీ మెగాస్టార్ కు మించిన డాన్స్ చేసే హీరోయిన్ అప్పట్లో ఒకరూ ఉండేవారూ.
ఆమె ఎవరో కాదు రాధ.మెగాస్టార్ చిరంజీవి రాధా కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి.సూపర్ హిట్ సాధించాయి అన్న విషయం తెలుసు.వీరిద్దరి కాంబినేషన్లో 1984లో గుండా అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించింది.
ఆ తర్వాత చిరంజీవి రాధా కాంబినేషన్ లో నాగు అనే సినిమా కూడా వచ్చింది.
ఇక చిరంజీవి రాధా కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి వచ్చిన చిత్రం దొంగ.సరైన హిట్ లేక తెలుగు చిత్రపరిశ్రమ మొత్తం శోకసంద్రంలో మునిగి పోతున్న సమయంలో దొంగ సినిమా వచ్చి సూపర్ హిట్ అందించి ప్రేక్షకులందరినీ కూడా అబ్బురపరిచింది.ఆ తర్వాత వీరి కాంబినేషన్లో అడవి దొంగ సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
మరణ మృదంగం సినిమా కూడా రాధా చిరంజీవి కాంబినేషన్ లో వచ్చి హిట్ అయింది.ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ స్టేట్ రౌడీ.
ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమాలో కూడా రాదా చిరంజీవితో డాన్స్ లో పోటీ పడింది అని చెప్పాలి.