ఆ స్టార్ హీరో పక్కన హీరోయిన్ ఛాన్స్ కోసం చిరంజీవి కూతురు అప్పట్లో అంతలా ప్రయత్నాలు చేసిందా..?

ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ( Mega Family ) లాంటి సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ ఎక్కడా లేదనే చెప్పాలి.నందమూరి,అక్కినేని మరియు మంచు కుటుంబాలలో ఒకరిద్దరు హీరోలు సక్సెస్ అయ్యారు ఇప్పటికీ కొనసాగుతున్నారు కానీ, మెగా ఫ్యామిలీ లో మాత్రం ఇప్పటి వరకు ఎంతమంది హీరోలైతే వచ్చారో, అంతమంది సక్సెస్ అయ్యారు.

 Chiranjeevi Daughter Sushmita Konidela Wanted To Act With Uday Kiran,uday Kiran,-TeluguStop.com

చిరంజీవి తో ప్రారంభమైన ఈ లేజసీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తారాస్థాయికి వెళ్ళింది.అలా మెగా ఫ్యామిలీ కి వీళ్లిద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు.

వీళ్ళిద్దరినీ ఆదర్శంగా తీసుకొని, వీళ్ళ అడుగుజాడల్లో అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ వంటి వారు ఇండస్ట్రీ లోకి వచ్చారు.అందరూ కూడా మంచి సక్సెస్ సాధించారు.

ముఖ్యంగా రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ అంచలంచలుగా ఎదిగి నేడు పాన్ వరల్డ్ స్టార్ స్టార్స్( Pan World Stars ) గా ఎదిగారు.

Telugu Chiranjeevi, Tollywood, Uday Kiran-Movie

ఇక వీళ్ళ తర్వాత మెగా ఫ్యామిలీ లో ఆడవాళ్లు కూడా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.వారిలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల( Niharika Konidela ) గురించి.ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ, ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం తో సినిమాలకు దూరమై, పెళ్లి చేసుకుంది.ఇప్పుడు మళ్ళీ ఆమె విడాకులు తీసుకోవడం తో మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో హీరోయిన్ గా నటించిన నిహారిక కొణిదెల, త్వరలోనే సినిమాల్లో కూడా హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.ఇకపోతే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల( Sushmita Konidela ) కూడా గతం లో సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని చూసిందట.

ఆరోజుల్లో ఉదయ్ కిరణ్ యూత్ లో ఒక ప్రభంజనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.

Telugu Chiranjeevi, Tollywood, Uday Kiran-Movie

ఉదయ్ కిరణ్( Uday Kiran ) అప్పట్లో సుస్మిత కి బాగా నచ్చాడు, సినిమాల్లో పని చెయ్యాలని ఆసక్తి ఉన్నప్పుడు అతనితోనే కలిసి నటించాలని అనుకుందట.కానీ ఎందుకో కుదర్లేదు.రీల్ లైఫ్ లో కుదరకపోయిన రియల్ లైఫ్( Real Life ) లో మాత్రం వీళ్లిద్దరు ఒకటి అవ్వాలని అనుకున్నారు.

స్వయంగా చిరంజీవే పెళ్లి సంబంధం కుదరించుకోవడానికి ఉదయ్ కిరణ్ వద్దకి వచ్చాడు.తొలుత ఆయన ఒప్పుకున్నాడు కానీ, ఆ తర్వాత ఎందుకో నాకు మీ అమ్మాయికి సెట్ అవ్వడం లేదండి అని చెప్పేసి ఉదయ్ కిరణ్ పెళ్లిని క్యాన్సిల్ చేసాడు.

అప్పట్లో వీళ్లిద్దరికీ చిరంజీవి నిశ్చితార్థం జరిపించిన సంగతి అందరికీ తెలిసిందే.ఆ తర్వాత ఉదయ్ కిరణ్ డౌన్ అవ్వడం, దానికి కారణం చిరంజీవే అని ప్రచారం చెయ్యడం, ఇలాంటివన్నీ మీడియా లో ఎన్నో ఏళ్ళ నుండి ప్రచారం అవుతూనే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube