ఎన్ని తప్పులు చేసినా సరే ఎవడో ఒకడు దొరుకుతాడు.. బేబీ గురించి చిరంజీవి అలా ఫీలయ్యారా?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన బేబీ మూవీ( Baby movie ) విడుదలై రెండు వారాలైనా ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.తాజాగా జరిగిన ఈ సినిమా కల్ట్ సెలబ్రేషన్స్ కు చిరంజీవి హాజరు కావడంతో పాటు చిరంజీవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 Chiranjeevi Comments About Baby Movie Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

బేబీ సినిమా ఫీలింగ్ మూడు రోజుల పాటు వెంటాడిందని ఆయన కామెంట్లు చేశారు.పాత తరంలోనే ఆగిపోతే సినిమా ఇండస్ట్రీ వెనుకబడిపోతుందని కొత్త తరం రావాలని అప్పుడే సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుందని చిరంజీవి వెల్లడించారు.

బేబీ సినిమాకు ఉచిత సలహా ఇచ్చి త్ప్పు చేశానని మెగాస్టార్ అన్నారు.బేబీ సినిమా క్లైమాక్స్ లో నాకు చిన్న తప్పు కనిపించిందని సినిమా చివర్లో హీరోయిన్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు డైరెక్టర్ చూపించాడని చిరంజీవి( Chiranjeevi ) చెప్పుకొచ్చారు.

హీరోయిన్ భర్తతో ఉన్న సమయంలో తను బాగానే ఉందని ఆనంద్ ను చూసిన సమయంలో మాత్రం బాధ పడుతుందని ఇలా చూపించడం వల్ల ఎన్ని తప్పులు చేసినా సరే ఎవడో ఒకడు దొరుకుతాడని వాడితో సెటిల్ కావచ్చనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుందేమో అనిపించిందని చిరంజీవి చెప్పుకొచ్చారు.మరో వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా హీరోయిన్ నన్ గా మారితే బాగుంటుందని నా అభిప్రాయమని ఉచిత సలహా ఇచ్చానని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.

అయితే ఈ విషయంలో డైరెక్టర్ కరెక్ట్ అని నేను తప్పు అని చిరంజీవి కామెంట్లు చేశారు.తెలిసో తెలియకో తప్పు చేస్తే లైఫ్ అయిపోయినట్టు కాదని లైఫ్ మళ్లీ చిగురిస్తుందనే మెసేజ్ ను ఈ సినిమా ద్వారా ఇచ్చారని చిరంజీవి చెప్పుకొచ్చారు.మెగాస్టార్ చిరంజీవి చెప్పిన విషయాలు సోషల్ మీడియా( Social media ) వేదికగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube