చెక్ బౌన్స్ అయిందా? కొత్త రూల్స్ ఇవే!

చెక్ బౌన్స్ అనేది నేడు చాలా పెద్ద సమస్యగా మారింది.ఈ క్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు పరిశ్రమల విభాగం PHDCCI (ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) చెక్ బౌన్స్ విషయంలో కఠినంగా ఉండాలని తెలిపింది.

 Check Bounced These Are The New Rules ,cheque Bounce, New Rules ,latest News,-TeluguStop.com

చెక్కు జారీ చేసిన వారి ఉపసంహరణను కొన్ని రోజులు నిలిపివేయాలంది.చెక్కు చెల్లించని తేదీ నుండి 90 రోజులలోపు ఇరువురి మధ్య సమస్యను పరిష్కరించాలని PHDCCI అంది.

ట్రాన్సక్షన్స్ ని నిర్వహించేందుకు చెక్కు ముఖ్యం.ఒక చెక్కు ద్వారా మనం డబ్బులను తీసుకోవచ్చు.

వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు చెక్కుని వినియోగిస్తుంటాయి.ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు అంతర్గతంగా బదిలీ చేయడానికి లేదా తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది.

అయితే కొన్ని సార్లు ఇది బౌన్స్ అయ్యే చాన్సు వుంది.ఇలా చెక్కు వలన కొనుగోలుదారు మరియు అమ్మేవారి మధ్య నమ్మకం పోతోంది. PHD ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (PHDCCI) ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రాకు చెక్ బౌన్స్ సమస్యను చెబుతూ ఓ లేఖ వ్రాసారు.అయితే దీనిపై పీహెచ్‌డీసీసీఐ జనరల్ సెక్రటరీ సౌరభ్ సన్యాల్ ఇలా అన్నారు… భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పెంచాలని.

వ్యాపారాన్ని ఈజీ చేయడంపై దృష్టి పెడుతోంది.చెక్కుల బౌన్స్‌ వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.

ఈ నేపథ్యంలో ఆయన అనేక విషయాలు తెలియజేసారు.చెక్కు జారీ చేసేవారి ఖాతా నుండి ఏమైనా పేమెంట్ చేయడానికి ముందు బౌన్స్ అయిన చెక్కును బ్యాంకింగ్ వ్యవస్థలోనే చెల్లించాలని చెప్పారు.లేదంటే చెక్ బౌన్స్ కేసు మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళకి కష్టమని తెలిపారు.అందుకనే మీరు ఎవరివద్దనన్నా ఒకవేళ చెక్ రూపంలో డబ్బుని తీసుకున్న యెడల ముందుగానే అన్ని విషయాలు పరిశీలించి తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదని ఈ సందర్భంగా అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube