ఏపీలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోన్న కొద్ది టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీ నేతల నుంచే మామూలు షాక్‌లు తగలడం లేదు.పలు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో గత యేడాది నామినేషన్లు వేసిన పార్టీ అభ్యర్థులు ఇప్పుడు నామినేషన్ల ఉప సంహరణ వేళ విత్ డ్రా చేసుకోవడమో లేదా వైసీపీలోకి వెళ్లిపోవడమో చేస్తున్నారు.
దీంతో వీరిని కాపాడుకోవడం ఇప్పుడు చంద్రబాబుకు తలకు మించిన భారంగా ఉంది. ప్రకాశం నెల్లూరు శ్రీకాకుళం చిత్తూరు పశ్చిమగోదావరి విశాఖ జిల్లాల్లోని అనేక మున్సిపల్ వార్డులకు గతేడాది పార్టీ నుంచి బీ ఫారాలు తీసుకుని కౌన్సెలర్లుగా నామినేషన్లు వేసిన వారంతా ఇప్పుడు అనేక ఒత్తిళ్లు లేదా ప్రలోబాలకు తలొగ్గి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
దీంతో పలు మున్సిపాల్టీల్లో కీలక వార్డులకు అభ్యర్థులు పోటీ చేసే వారే లేకుండా పోయారు.నామినేషన్లు ముగిసిన కారణంగా సదరు వార్డుల్లో ఇంకెవరితోను నామినేషన్లు వేయించే అవకాశాలు లేవు.
దీంతో పలు వార్డుల్లో అసలు టీడీపీ పోటీలో లేని పరిస్థితి.కొన్ని చోట్ల టీడీపీ కౌన్సెలర్ అభ్యర్థులపై నమ్మకం లేక వారిని క్యాంపులకు తరలిస్తున్నారు.
నామినేషన్ల ఉప సంహరణ పూర్తయ్యాక వారిని తిరిగి తీసుకు రానున్నారు.ఇక కొన్ని చోట్ల ఒక వార్డులోనే అనేక మంది నామినేషన్లు వేశారు.
గుంటూరు – విజయవాడ – మచిలీపట్నం లాంటి అనేక మున్సిపాలిటీల్లో ఒకరికి మించి నామినేషన్లు వేసేశారు.

వీళ్లు విత్ డ్రాలు చేసుకునేందుకు ఒప్పుకోవడం లేదు.ఇక్కడ ఒకరికి బీ ఫామ్ ఇస్తే మిగిలిన వాళ్లు పార్టీకి ఖచ్చితంగా యాంటీగా చేయడం ఖాయం.దీంతో చంద్రబాబు వీరిని బుజ్జగించేందుకు కీలక నేతలు, మాజీ మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.
అయితే వారు వేస్తోన్న ప్రశ్నలతో ఈ ఇన్ చార్జ్‌లకు దిమ్మ తిరిగిపోతోందట.మరి టీడీపీలో ఈ గొడవ ఎప్పటకి సర్దుబాటు అవుతుందో ? చూడాలి.