మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Naidu arrest ) అయ్యి 40 రోజులు అవుతోంది.చంద్రబాబు బెయిల్ పై త్వరలో విడుదలవుతారని అభిమానులు భావిస్తున్నా కోర్టులలో ఆయనకు అనుకూల ఫలితాలు రావడం లేదు.
చంద్రబాబుపై వేర్వేరు కేసులు నమోదు కావడంతో ఆయన ఈ కేసుల నుంచి ఎప్పుడు బయటపడతారో చెప్పడం కూడా కష్టమవుతోంది.టీడీపీ అభిమానులు చంద్రబాబు అరెస్ట్ వల్ల నిరాశలో ఉన్నారు.
సరిగ్గా ఇదే సమయంలో బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) థియేటర్లలో విడుదలవుతోంది.బాలయ్యకు సైతం ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయడం ఇష్టం లేకపోయినా చాలారోజుల క్రితమే ప్రకటించిన డేట్ కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ మారలేదు.అయితే భగవంత్ కేసరి బుకింగ్స్ కొన్ని ఏరియాలలో డల్ గా ఉండటానికి చంద్రబాబు అరెస్ట్ కారణమని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.టీడీపీ నేతలు, కార్యకర్తలు సినిమాలు చూసి ఎంజాయ్ చేసే స్థితిలో లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ జరగకుండా ఉండి ఉంటే భగవంత్ కేసరి బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉండేవి.అయితే దసరా పండుగకు సరైన సినిమా భగవంత్ కేసరి అని చాలామంది భావిస్తున్నారు.
ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేవాళ్లకు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
భగవంత్ కేసరి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా బుకింగ్స్ పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.బాలయ్య( Balakrishna ) ఫ్యాన్స్ మాత్రం ఈ దసరాకు దబిడి దిబిడే అని బాలయ్య భగవంత్ కేసరి దసరా విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
మరికొన్ని గంటల్లో భగవంత్ కేసరి ఫలితం తేలిపోనుంది.