ఏపీపీఎస్సీ 2022 గ్రూప్1 ఫలితాలలో సత్తా చాటిన వారిలో అనంతపూర్ జిల్లా కదిరిలోని గంజివారిపల్లికి చెందిన భవాని ఒకరు.తాజాగా వెలువడిన గ్రూప్1 ఫలితాలలో భవాని డీఎస్పీగా ఎంపిక కావడం గమనార్హం.
భవాని గతంలో గ్రూప్2 లో ఎంపికై వ్యవసాయశాఖ కమిషనరేట్ లో పని చేశారు.ఆ తర్వాత చాపాడు మండలంలో డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగానికి ఎంపికై ఆ ఉద్యోగంలో కొనసాగుతున్నారు.గ్రూప్1 పరీక్ష ద్వారా భవాని డీఎస్పీగా ఎంపిక కావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.భవాని భర్త విశ్వనాథ్( Viswanathan ) ప్రస్తుతం రాయలసీమ థర్మల్ విద్యుత్ ఉత్పాదన సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
వైఎస్సార్ జిల్లాలోని ఎర్రగుంట్లలో భవాని భర్త పని చేస్తున్నారు.భవాని తల్లి తులసి గృహిణి కాగా తండ్రి చెన్నకృష్ణ కదిరిలో ట్రాన్స్ కో అసిస్టెంట్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.
భవానికి( Bhavani ) డీఎస్పీగా ఎంపిక కావడంపై గంజివారిపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.చదువు పూర్తై ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న వారు ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తే ఆలస్యంగానైనా ఉద్యోగానికి ఎంపికయ్యే ఛాన్స్ అయితే ఉంది.భర్త, కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉండటం వల్లే భవాని కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎక్కి సులువుగా డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యారు.
బాల్యం నుంచి చదువులో ప్రతిభ చూపిన భవాని కష్టపడి గ్రూప్1 ర్యాంక్( APPSC Group 1 ) సాధించారు.భవిష్యత్తులో భవాని కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.భవాని రేయింబవళ్లు కష్టపడి చదవడం వల్లే సులువుగా తన లక్ష్యాన్ని సాధించారని సమాచారం అందుతోంది.
ఆడపిల్లలను చదివిస్తే ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో భవాని ప్రూవ్ చేశారు.ఒకటి కంటే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన భవాని ప్రశంసలు అందుకుంటున్నారు.