ఫుడ్ డెలివరీలు చేస్తున్న జొమాటో సీఈవో.. ఈ విషయం తెలిసి అందరూ షాక్!

సాధారణంగా కంపెనీ యజమానులు ఆఫీసులో వర్క్ చేయడం వరకే పరిమితం అవుతారు.ఉద్యోగుల వలె బయటికి వెళ్లి కష్టపడరు.

 Ceo Of Zomato Who Is Doing Food Deliveries Everyone Is Shocked To Know This ,zo-TeluguStop.com

అయితే జొమాటో సీఈవో మాత్రం ఇలాంటి యజమానులందరికీ భిన్నం.అతను ప్రతి మూడేళ్ల నుంచి డెలివరీ బాయ్ గా మారి ఫుడ్ ఇంటింటికి వెళ్లి ఇచ్చి వస్తున్నారు.

ఈ విషయాన్ని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సంజీవ్ బిఖ్‌చందానీ శుక్రవారం తన ట్విట్టర్ పోస్ట్‌లో వెల్లడించారు.జొమాటో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపిందర్ గోయల్‌తో జరిపిన ఒక సంభాషణలో ఈ విషయం తెలిసిందని అన్నారు.

“జొమాటో సీఈవో సాధారణ డెలివరీ బాయ్స్ లాగానే యూనిఫాం ధరించి, బైక్‌పై ఎక్కి ఆర్డర్‌లను అందజేస్తారు.ఇప్పటివరకు అతన్ని ఎవరూ గుర్తించలేదట.అందుకే ఈ విషయం బయటికి రాలేదు.” అని సంజీవ్ చెప్పుకొచ్చారు.“ఇప్పుడే దీపిందర్ గోయల్‌, జొమాటో టీమ్‌ను కలుసుకున్నాం.దీపిందర్‌తో సహా సీనియర్ మేనేజర్‌లందరూ రెడ్ కలర్ జొమాటో టీషర్ట్ ధరించి, మోటార్‌సైకిల్‌పై ఎక్కి, కనీసం మూడు నెలలకి ఒకసారి ఆర్డర్‌లను డెలివరీ చేస్తూ ఒక రోజు గడుపుతున్నారు.ఈ విషయం తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది.” అని నౌక్రి మాతృ సంస్థ యజమాని రాశారు.

కంపెనీలో పెద్ద తల అయిన మేనేజర్లు, సీఈవోలు ఇలా తిరగడం వల్ల కస్టమర్లు, బిజినెస్ పార్ట్‌నర్స్‌ని అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది.క్యూలలో ఉండటం, సాధారణ కస్టమర్ వంటి వివిధ వేషధారణలతో, ఫ్రంట్‌లైన్ సిబ్బందితో మాట్లాడటం, అన్ని సమస్యలకు పరిష్కారాలను వెతకడం, అక్కడికక్కడే కస్టమర్ రివ్యూలు పొందడం కూడా సాధ్యమవుతుంది.నిజంగా ఈ విధానం చాలా గొప్పది అని ట్విట్టర్ యూజర్లు కూడా పొగుడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube