పద్ధతి మార్చుకోకపోతే ఓటీటీలకు సెన్సార్ తప్పదు... వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రి!

కరోనా వచ్చిన తర్వాత థియేటర్ లు మూతపడటంతో ఓటీటీ( Ott ) లకు ఎంతో మంచి డిమాండ్ ఏర్పడింది.ఈ క్రమంలోని ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

 If The Method Is Not Changed, Otts Will Have To Be Censored, Ott, Anurag Thakur,-TeluguStop.com

అయితే కొన్ని సినిమాలు వెబ్ సిరీస్( Web series ) లో మాత్రం బోల్డ్ కంటెంట్ ఉండడం చేత ఈ వెబ్ సిరీస్ లపై ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందిస్తూ ఘాటుగా విమర్శలు చేశారు.ప్రస్తుత కాలంలో వస్తున్నటువంటి కొన్ని వెబ్ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా లేవని తెలిపారు.

ఇందుకు గల కారణం ఓటీటీలకు సెన్సార్ లేకపోవడమే కారణమని తెలిపారు.అయితే తాజాగా ఈ విషయం గురించి కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Anurag Thakur, Vulgar-Movie

తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ ( Anurag Thakur ) సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోని పలువురు ఎంపీలు ఓటీటీలో వస్తున్న బోల్డ్, వల్గర్ కంటెంట్ గురించి కూడా కేంద్రమంత్రిని ప్రశ్నించారు.ఓటీటీల్లో పిల్లలు చూడకూడని కంటెంట్ వస్తోందని.ప్రస్తుతం వస్తున్నటువంటి ఓటీటిలలో కాస్త బోల్డ్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంది అంటూ ఫిర్యాదులు చేశారు.అయితే ఈ విషయంపై మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Anurag Thakur, Vulgar-Movie

ఇటీవల ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది.ఓటీటీలో కూడా ఎన్నో మంచి కంటెంట్స్ వస్తున్నాయి. కొంతమంది మాత్రమే బోల్డ్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు సిరీస్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇటీవలే ఓటీటీ సంస్థలతో సమావేశం జరిగింది.ఓటీటీలకు స్వీయ నియంత్రణ అవసరం.

ఇదే విషయమే వారికి కూడా తెలియజేశామని తెలిపారు.ఓటీటీల విషయంలో తమ పద్ధతి మార్చుకోకపోతే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అవసరమైతే ఓటిటిలకు కూడా సెన్సార్ అందుబాటులోకి తీసుకు వస్తాము అంటూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube