కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త… OPSపై కీలక ఉత్తర్వులు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త.పాత పెన్షన్ విధానంపై తాజాగా ఓ న్యూస్ బయటకి వచ్చింది.

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శ�-TeluguStop.com

ఎంపిక చేసిన కేంద్ర ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌ను ఎంచుకునే అవకాశం లభిస్తోంది.మీరు విన్నది నిజమే.2003 డిసెంబర్ 22వ తేదీలోపు ప్రకటనలు లేదా నోటిఫై చేసిన పోస్టుల కోసం సెంట్రల్ సర్వీసెస్‌లో చేరిన ఉద్యోగులకు ఒకసారి పాత పెన్షన్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.తాజాగా దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదల చేసింది.

Telugu Central, Important, Latest, Scheme, Ops Scheme-Latest News - Telugu

ఈ ఉత్తర్వుల ప్రకారం.పాత పెన్షన్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి అర్హులైన కేంద్ర ఉద్యోగులందరూ.కొత్త ఆప్షన్‌ను ఎంచుకోవడానికి ఆగస్టు 31వ తేదీ వరకు సమయం ఇచ్చారు.కాబట్టి అర్హత ఉన్న ఉద్యోగులు గడువు ముగిసేలోపు పాత పెన్షన్ స్కీమ్‌ను ఎంచుకోకపోతే.వారు ఆటోమేటిక్‌గా కొత్త పెన్షన్ స్కీమ్ కింద కవర్ అవుతారని గుర్తు పెట్టుకోవాలి.అంటే ఆగస్టు 31వ తేదీలోపు అర్హులైన సెంట్రల్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఏ ఎంపికను ఎంచుకున్నా.

అది ఫైనల్‌గా పరిగణిస్తారు.గడువు ముగిసిన తరువాత పెన్షన్ స్కీమ్ ఎంపికను మార్చుకునే సౌకర్యం ఉండదని మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Telugu Central, Important, Latest, Scheme, Ops Scheme-Latest News - Telugu

2004లో సర్వీసుల్లో చేరిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ సిబ్బంది, ఇతర కేంద్ర ఉద్యోగులకు కూడా ఈ ఆర్డర్ వర్తిస్తుంది.పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరించడం వల్ల ప్రభుత్వంపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని నిపుణులు అంటున్నారు.గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో తమకు కూడా పాత పెన్షన్‌ విధానమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉండగా ఇన్నాళ్లు ఈ విషయంపై మౌనంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఓపీఎస్‌పై కీలక నిర్ణయం తీసుకుంది.

దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube