ఆ నంబర్‌ ప్లేట్‌ ఖరీదు రూ.60 కోట్లు

నంబర్‌ ప్లేట్‌ ఏంటి.రూ.60 కోట్లు ఏంటి.ఏదైనా తప్పు రాశారా అని అనిపిస్తోందా? లేదు.ఇది నిజం.ఓ వ్యక్తి కేవలం తనకు ఇష్టమైన నంబర్‌ కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు చేశాడు.అతని పేరు బిల్విందర్‌ సింగ్‌ సాహ్ని.మన భారతీయుడే.

 Car Number Plate Price 60 Crores-TeluguStop.com

కానీ దుబాయ్‌లో సెటిలయ్యాడు.ఎప్పుడో ముడు దశాబ్దాల కిందట ఇండియా నుంచి గల్ఫ్‌కు వెళ్లిన బల్విందర్‌.

రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో రెండు చేతులా సంపాదించాడు.

Telugu Dubaibalvindhar, India-

ఎంతలా అంటే తన గ్యారేజ్‌లో ఇప్పుడు సుమారు వంద కార్లు ఉంటాయి.అందులో అత్యంత ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.తాజాగా రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ కారు కొన్నాడు.ఈ కారు విలువ రూ.10 కోట్లు.కానీ ఆ కారుకు తనకిష్టమైన నంబర్‌ను పెట్టుకోవడానికి ఏకంగా ఆరు రెట్లు ఎక్కువ చెల్లించాడు.

D5 అనే నంబర్‌ తన కొత్త కారుపై ఉండాలని పట్టుబట్టిన బల్విందర్‌.వేలంలో రూ.60 కోట్లు చెల్లించి దానిని సొంతం చేసుకున్నాడు.ఇతనికి కార్లతోపాటు వాటిపై ఫ్యాన్సీ నంబర్ల పిచ్చి కూడా బాగానే ఉంది.గతంలోనూ O9 అనే నంబర్‌ కోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేశాడు.కార్ల నంబర్ల వేలం యూఏఈలో చాలా రోజుల నుంచి ఉన్నదే.

ప్రతి నెలా ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఆ దేశం భారీ మొత్తం ఆర్జిస్తోంది.దుబాయ్‌లాంటి నగరంలో కుబేరులకు కొదవ లేదు.దీంతో ఇలా కార్ల నంబర్ల కోసం కూడా భారీ మొత్తం వెచ్చించడానికి వాళ్లు ఏమాత్రం వెనుకాడరు.ఆర్‌ఎస్‌జీ ఇంటర్నేషనల్‌ అనే ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి బల్విందర్‌ ఓనర్‌.

ఈ కంపెనీ యూఏఈతోపాటు కువైట్‌, ఇండియా, అమెరికా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube