ఆ నంబర్ ప్లేట్ ఖరీదు రూ.60 కోట్లు
TeluguStop.com
60 కోట్లు ఏంటి.ఏదైనా తప్పు రాశారా అని అనిపిస్తోందా? లేదు.
ఇది నిజం.ఓ వ్యక్తి కేవలం తనకు ఇష్టమైన నంబర్ కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు చేశాడు.
అతని పేరు బిల్విందర్ సింగ్ సాహ్ని.మన భారతీయుడే.
కానీ దుబాయ్‌లో సెటిలయ్యాడు.ఎప్పుడో ముడు దశాబ్దాల కిందట ఇండియా నుంచి గల్ఫ్‌కు వెళ్లిన బల్విందర్.
రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో రెండు చేతులా సంపాదించాడు. """/" /ఎంతలా అంటే తన గ్యారేజ్‌లో ఇప్పుడు సుమారు వంద కార్లు ఉంటాయి.
అందులో అత్యంత ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.తాజాగా రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు కొన్నాడు.
ఈ కారు విలువ రూ.10 కోట్లు.
కానీ ఆ కారుకు తనకిష్టమైన నంబర్‌ను పెట్టుకోవడానికి ఏకంగా ఆరు రెట్లు ఎక్కువ చెల్లించాడు.
D5 అనే నంబర్ తన కొత్త కారుపై ఉండాలని పట్టుబట్టిన బల్విందర్.వేలంలో రూ.
60 కోట్లు చెల్లించి దానిని సొంతం చేసుకున్నాడు.ఇతనికి కార్లతోపాటు వాటిపై ఫ్యాన్సీ నంబర్ల పిచ్చి కూడా బాగానే ఉంది.
గతంలోనూ O9 అనే నంబర్ కోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేశాడు.
కార్ల నంబర్ల వేలం యూఏఈలో చాలా రోజుల నుంచి ఉన్నదే.ప్రతి నెలా ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఆ దేశం భారీ మొత్తం ఆర్జిస్తోంది.
దుబాయ్‌లాంటి నగరంలో కుబేరులకు కొదవ లేదు.దీంతో ఇలా కార్ల నంబర్ల కోసం కూడా భారీ మొత్తం వెచ్చించడానికి వాళ్లు ఏమాత్రం వెనుకాడరు.
ఆర్‌ఎస్‌జీ ఇంటర్నేషనల్ అనే ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ కంపెనీకి బల్విందర్ ఓనర్.ఈ కంపెనీ యూఏఈతోపాటు కువైట్, ఇండియా, అమెరికా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఇదేందయ్యా ఇది.. రివ్యూను ఎవరైనా ఇలా కూడా అడిగి తీసుకుంటారా..?