బహిష్కరణపై భారతీయ విద్యార్ధులకు ఊరట , తాత్కాలిక వీసాలు .. నిందితులను వదలబోమన్న కెనడా

నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్లతో( Fake Visa ) అడ్మిషన్లు సంపాదించిన 700 మంది భారతీయ విద్యార్ధులను( Indian Students ) దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా( India ) ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం ఇరు దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది.

 Canadian Govt To Probe Visa Fraud Issue Temporary Permits To Indian Students Det-TeluguStop.com

భారత్, కెనడాలకు చెందిన రాజకీయ పార్టీలు విద్యార్థుల పక్షాన నిలబడ్డాయి.ఈ ప్రయత్నాలు ఫలించి విద్యార్ధుల బహిష్కరణ ప్రక్రియను కెనడా ప్రభుత్వం నిలిపివేసింది.

అంతేకాదు.భారతీయ విద్యార్ధులకు తాత్కాలిక అనుమతులను కూడా జారీ చేస్తామని తెలిపింది.

వీసా మోసంపై విచారణను ప్రారంభించి, దేశంలోనే వుండేందుకు అవకాశం కూడా కల్పిస్తోంది.

ఈ వ్యవహారంపై కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్( Minister Sean Fraser ) మాట్లాడుతూ.

ఇమ్మిగ్రేషన్ మోసానికి పాల్పడని విదేశీ విద్యార్ధులు బహిష్కరణను ఎదుర్కోరని చెప్పారు.చదువుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన , నకిలీ డాక్యుమెంటేషన్‌పై అవగాహన లేని అంతర్జాతీయ విద్యార్ధులు కెనడాలో వుండేందుకు వీలుగా Temporary Resident Permits’ను జారీ చేస్తున్నట్లు ఫ్రేజర్ చెప్పారు.

ఎలాంటి మోసాలకు పాల్పడని విదేశీ విద్యార్ధులు బహిష్కరణకు గురికారని తాను స్పష్టం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

Telugu Canada Indian, Canadian, Letters, Fraud, Indian, Kuldeepsingh, Sean Frase

కాగా.ఇమ్మిగ్రేషన్ స్కామ్‌లో పంజాబ్‌కు చెందిన విద్యార్ధులే ఎక్కువ.కెనడియన్ బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ ప్రకారం నకిలీ ఆఫర్ లెటర్స్‌తో అడ్మిషన్లు సంపాదించారన్నది వీరిపై వున్న అభియోగం.

ఈ విద్యార్ధులలో ఎక్కువమంది 2018, 2019లలో చదువుకోవడానికి కెనడా వచ్చారు.అయితే కెనడాలో శాశ్వత నివాసం కోసం విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ మోసం వెలుగుచూసింది.విద్యార్ధులను తప్పుదోవ పట్టించిన వారు, మోసం చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఫ్రేజర్ చెప్పారు.

Telugu Canada Indian, Canadian, Letters, Fraud, Indian, Kuldeepsingh, Sean Frase

మరోవైపు.విద్యార్ధులు నకిలీ ఏజెంట్ల బారినపడినందున కెనడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహారించాలని భారత్ కోరుతోంది.విద్యార్ధులకు మద్ధతుగా పంజాబ్‌లోని పలు పార్టీల ఎంపీలు విక్రమ్ సింగ్ సాహ్నీ, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ , ఎన్ఆర్ఐ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ కేంద్ర విదేశాంగ శాఖకు లేఖలు రాశారు.

అలాగే కెనడాకు చెందిన రాజకీయ పార్టీల నేతలు, ఎంపీలు కూడా విద్యార్ధులకు మద్ధతుగా నిలిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube