బహిష్కరణపై భారతీయ విద్యార్ధులకు ఊరట , తాత్కాలిక వీసాలు .. నిందితులను వదలబోమన్న కెనడా

నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్లతో( Fake Visa ) అడ్మిషన్లు సంపాదించిన 700 మంది భారతీయ విద్యార్ధులను( Indian Students ) దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా( India ) ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారం ఇరు దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది.భారత్, కెనడాలకు చెందిన రాజకీయ పార్టీలు విద్యార్థుల పక్షాన నిలబడ్డాయి.

ఈ ప్రయత్నాలు ఫలించి విద్యార్ధుల బహిష్కరణ ప్రక్రియను కెనడా ప్రభుత్వం నిలిపివేసింది.అంతేకాదు.

భారతీయ విద్యార్ధులకు తాత్కాలిక అనుమతులను కూడా జారీ చేస్తామని తెలిపింది.వీసా మోసంపై విచారణను ప్రారంభించి, దేశంలోనే వుండేందుకు అవకాశం కూడా కల్పిస్తోంది.

ఈ వ్యవహారంపై కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్( Minister Sean Fraser ) మాట్లాడుతూ.

ఇమ్మిగ్రేషన్ మోసానికి పాల్పడని విదేశీ విద్యార్ధులు బహిష్కరణను ఎదుర్కోరని చెప్పారు.చదువుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన , నకిలీ డాక్యుమెంటేషన్‌పై అవగాహన లేని అంతర్జాతీయ విద్యార్ధులు కెనడాలో వుండేందుకు వీలుగా Temporary Resident Permits’ను జారీ చేస్తున్నట్లు ఫ్రేజర్ చెప్పారు.

ఎలాంటి మోసాలకు పాల్పడని విదేశీ విద్యార్ధులు బహిష్కరణకు గురికారని తాను స్పష్టం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

"""/" / కాగా.ఇమ్మిగ్రేషన్ స్కామ్‌లో పంజాబ్‌కు చెందిన విద్యార్ధులే ఎక్కువ.

కెనడియన్ బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ ప్రకారం నకిలీ ఆఫర్ లెటర్స్‌తో అడ్మిషన్లు సంపాదించారన్నది వీరిపై వున్న అభియోగం.

ఈ విద్యార్ధులలో ఎక్కువమంది 2018, 2019లలో చదువుకోవడానికి కెనడా వచ్చారు.అయితే కెనడాలో శాశ్వత నివాసం కోసం విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ మోసం వెలుగుచూసింది.

విద్యార్ధులను తప్పుదోవ పట్టించిన వారు, మోసం చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఫ్రేజర్ చెప్పారు.

"""/" / మరోవైపు.విద్యార్ధులు నకిలీ ఏజెంట్ల బారినపడినందున కెనడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహారించాలని భారత్ కోరుతోంది.

విద్యార్ధులకు మద్ధతుగా పంజాబ్‌లోని పలు పార్టీల ఎంపీలు విక్రమ్ సింగ్ సాహ్నీ, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ , ఎన్ఆర్ఐ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ కేంద్ర విదేశాంగ శాఖకు లేఖలు రాశారు.

అలాగే కెనడాకు చెందిన రాజకీయ పార్టీల నేతలు, ఎంపీలు కూడా విద్యార్ధులకు మద్ధతుగా నిలిచారు.

మహేష్ బాబు సినిమా కోసం భారీ డిసీజన్స్ తీసుకుంటున్న రాజమౌళి…