ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్ హోం కష్టమర్ల కు బంపర్ ఆఫర్ ...!

స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా ఎయిర్టెల్ తమ వినియోగదారులకు ఒక కొత్త ప్లాన్ ను తీసుకుని వచ్చింది.అయితే ఇది ఎక్స్ ట్రీమ్ ఫైబర్ హోం వినియోగదారుల కోసం మాత్రమే.

 Xtreme, Airtel, Offer, Dth, Subscriber-TeluguStop.com

అయితే కొత్త ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే వాళ్లకు అదనంగా 1000 జీబీ డేటాను ఉచితంగా అందిస్తుంది.అయితే ఈ ఆఫర్ అనేది ఎయిర్ టెల్ తన ఎక్స్ ట్రీమ్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అందిస్తున్న అన్ని ప్రముఖ నగరాల్లో అందుబాటులో ఉన్నది.

ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్ ద్వారా సెకనుకు 1 జీబీ వరకు వేగంతో ఇంటర్నెట్ ను అందిస్తున్నది.దీని కోసం నెలకు రూ.799 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో కూడిన బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

అలా ఎంచుకొన్నపుడు మీకు ప్లాన్ తో వచ్చే డేటా కాకుండా 1000 జీబీ డేటా అదనంగా లభిస్తుంది.

అంతేకాకుండా ఈ ఫ్రీ డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎయిర్ ఎక్స్ ట్రీమ్ కంటెంట్, వింక్ మ్యూజిక్ కు కూడా యాక్సెస్ లభిస్తుంది.అంతేకాకుండా ఎవరయితే ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ వినియోగిస్తున్నారో వాళ్ళు కూడా రూ.1,500 చెల్లించడం ద్వారా ఎక్స్ ట్రీమ్ బాక్స్ కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.ఈ ఎక్స్ ట్రీమ్ బాక్స్ ఇంకా తక్కువ ధరకే పొందాలంటే కూడా ఒక ఆఫర్ ఉంది అది ఏంటంటే వినియోగదారులు రూ.799 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో కూడిన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ లో ఎదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఇలా ఏదన్నా ఒక ప్లాన్ ఎంచుకున్న తర్వాత 1500 రూపాయలు డిపాజిట్ చేయాలి.

ఈ డిపాజిట్ మనీ అనేవి రీఫండబుల్.జస్ట్ సెక్యూరిటీ అవసరానికి కట్టాలి.సెక్యూరిటీ డిపాజిట్ పొందిన తర్వాత ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ యూజర్లు రూ.452 చెల్లించి కంటెంట్ ప్యాక్ కొనుగోలు చేయడం ద్వారా ఆ బాక్స్ ను యాక్టివేట్ చేసుకోవాలి.అయితే ఇప్పటికే మీకు ఒక కనెక్షన్ ఉండి ఇది రెండో కనెక్షన్ అయితే రూ.452 బదులుగా రూ.360 చెల్లించినా సరిపోతుంది అని ఎయిర్టెల్ సంస్థ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube