ఆయన తన సుఖం కోసం వేరే వాళ్ళ బట్టలు విప్పేస్తాడంట....

ప్రస్తుత కాలంలో ప్రముఖ టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా మాధ్యమాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు.అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ “ఆర్నబ్” అనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

 Rgv Sensational Comments On Arnab Movie,arnab Movie, Telugu Movie, Telugu Direct-TeluguStop.com

కాగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.

అయితే ఇందులో తన చిత్రంలో ఆర్నబ్ తన సుఖం కోసం వేరే వాళ్ళ బట్టలు విప్పుతాడని, కానీ వేశ్య మాత్రం  ఇతరుల సుఖం కోసం తన బట్టలు విప్పుతుందని అదే తేడా అంటూ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేసాడు.

దీంతో కొందరు ఈ ట్వీట్ ని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ ట్రోల్స్  చేస్తున్నారు.అంతేకాక ప్రస్తుతం టిఆర్పి రేటింగ్ కోసం  ఓ జర్నలిస్ట్ మరియు న్యూస్ రీడర్ ఎంతటికైనా తెగిస్తాడని అతడి జీవిత గాధ ఆధారంగానే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీస్తున్నాడని పలు వార్తలు వినిపిస్తున్నాయి.

 అంతేకాకుండా గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ ఆర్నబ్ న్యూస్ ప్రాస్టిట్యూట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దీంతో అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రాంగోపాల్ వర్మ మర్డర్, థ్రిల్లర్ అనే రెండు చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఇప్పటికే మర్డర్ అనే చిత్ర విడుదలను వాయిదా వేయాలని నల్గొండ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఈ చిత్రం విడుదలపై కొంతమేర సందిగ్దత నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube