తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ( Telangana Assembly Elections Result )నిరాశపరచడంతో వచ్చే లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఫోకస్ పెట్టింది.నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపడుతూ, అభ్యర్థుల ఎంపిక, గెలుపు అవకాశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్( BRS Working President KTR ) కసరత్తు చేస్తున్నారు.
ఏ నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీకి దింపాలనే విషయంపై కసరత్తు చేస్తున్నారు.ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థులు ఎవరు అనేదానిపైన ఆరా తీస్తూ వారిని ఢీకొట్టగల బలమైన నేతలను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు.
మెదక్ నుంచి కేసీఆర్, నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేయడం ఖాయమైనా ఇప్పటికీ వారి పేర్లను ప్రకటించలేదు.ప్రస్తుతం బీఆర్ఎస్ కు తొమ్మిది మంది లోక్ సభ సభ్యులు ఉన్నారు.
వీరిలో ముగ్గురు మాత్రమే పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు.మిగతా సిట్టింగ్ ఎంపీలు పోటీకి దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉండడంతో బీఆర్ఎస్ కు అభ్యర్థుల ఎంపిక కష్టతరంగా మారింది.
ప్రస్తుత సెట్టింగ్ ఎంపీలకు అనేక వ్యాపారాలు ఉండడంతో, ప్రస్తుత తరుణంలో పోటీకి దూరంగా ఉండడమే మంచిదనే ఆలోచనతో ఉన్నారట.ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలు కొంతమంది ఇతర పార్టీలలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా బీఆర్ఎస్( BRS ) అనుమానిస్తుంది.దీంతో ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం బీఆర్ఎస్ కు తలకు మించిన భారంగా మారింది.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో, టిఆర్ఎస్ నుంచి పోటీ చేసినా గెలుపు అవకాశాలు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంటాయనే ఆలోచనతో చాలామంది బీఆర్ఎస్ నుంచి ఎంపీలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించకపోవడంతో, అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్ కు కష్టతరంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మూడు నెలల్లోనే మళ్ళీ లోక్ సభ ఎన్నికల్లో( Telangana Loksabha Elections ) పోటీ చేయాల్సి రావడం, బిజెపి, కాంగ్రెస్ లను ఢీకొట్టడం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆషామాషీ వ్యవహారం కాదని బీఆర్ఎస్ అనుమానిస్తోంది.అందుకే ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలను గుర్తించి, వారిని ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించాలని చూస్తోంది.కానీ ఎంపీలుగా పోటీ చేసేందుకు చాలామంది విముఖత చూపిస్తుండడంతో ,ఎవరిని పోటీకి దించాలనే విషయంలో బీఆర్ఎస్ తర్జనభజన పడుతోంది.