రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన 'బ్రో'.. పవర్ స్టార్ ఖాతాలో మొత్తం ఆరు..

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మెగా మల్టీస్టారర్ ఈ వీకెండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ముందు నుండి భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న బ్రో సినిమా జులై 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

 Bro Box Office Collection Day 3, Vinodhaya Sitham, Pawan Kalyan, Sai Dharam Tej-TeluguStop.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్( BRO movie )” వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

Telugu Bro Box Day, Bro, Ketika Sharma, Pawan Kalyan, Sai Dharam Tej-Movie

పవన్ కళ్యాణ్ జస్ట్ గెస్ట్ రోల్ లో నటించినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ సైతం మంచి ఉత్సాహంగా ఎదురు చూసారు.మరి ఎట్టకేలకు రిలీజ్ అవ్వగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.మొదటి రోజే ఈ సినిమా 34 కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయగా వీకెండ్ లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టింది.

మొత్తంగా 3 రోజుల్లోనే బ్రో సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయినట్టు తెలుస్తుంది.

Telugu Bro Box Day, Bro, Ketika Sharma, Pawan Kalyan, Sai Dharam Tej-Movie

బ్రో సినిమాకు మొదటి షో తోనే మిశ్రమ స్పందన వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) స్టామినాతో ఏకంగా మొదటి వీకెండ్ లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయేలా చేసారు.దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఇక ఈ సినిమా అన్ని చోట్ల కలిసి 98 కోట్ల బిజినెస్ చేసుకుని 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.

దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా బ్రేక్ చేసేసినట్టే అనిపిస్తుంది.ఏది ఏమైనా బ్రో టాక్ కొద్దిగా మిశ్రమంగా వచ్చినప్పటికి పవర్ స్టార్ స్టామినాతో ఈ సినిమా ప్లాప్ అవకుండా కాపాడేసాడు.

అదే మంచి టాక్ వచ్చి ఉంటే ఈ వీకెండ్ మరింత కలెక్షన్స్ రాబట్టేది.ఇక పవర్ స్టార్ కెరీర్ లో ఇప్పటికే ఐదు 100 కోట్ల సినిమాలు ఉండగా ఇప్పుడు ఆరవ సినిమాగా బ్రో కూడా ఈ లిస్టులో చేరిపోయింది.

మరి సోమవారం టెస్ట్ లో బ్రో సినిమా ఎంత వరకు పాస్ అవుతుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube