పెరుగుతున్న సెకండ్ వేవ్... మరో సారి దేశవ్యాప్త లాక్ డౌన్

పెరుగుతున్న సెకండ్ వేవ్ కరోనా కేసుల నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించింది బ్రిటన్.బ్రిటన్‌లో బుధవారం ఒక్కరోజే సుమారు 500 మంది ప్రాణాలు కోల్పోవడం తో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

 Britan Announce Lock Down Again Because Of Second Coronavirus Wave Cases Increas-TeluguStop.com

దీనితో బ్రిటన్ వ్యాప్తంగా రెండో విడత లాక్‌డౌన్‌ గురువారం నుండి ప్రారంభమైంది.మంగళవారం కన్నా మరణాల రేటు 24 శాతం పెరిగింది.

అలాగే సుమారు 12వేల మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు.మొదటి దశలో కన్నా కరోనా ఉధృతి అధికంగా ఉంటుందని, దీంతో రెండువారాల్లో ఆస్పత్రులు నిండిపోయే ప్రమాదం ఉందని ఆరోగ్య వేత్తలు హెచ్చరించారు.

కాగా, ఈ ఏడాది మార్చిలో మొదటి విడత లాక్‌డౌన్‌ను విధించగా ఇప్పుడు తాజాగా రెండో విడత లాక్ డౌన్ ను విధిస్తూ బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ సలహా సంస్థ సేజ్‌ సెకండ్‌ వేవ్‌ యూరప్‌ని ఘోరంగా దెబ్బతీస్తుందని హెచ్చరించడం తో అప్రమత్తమైన ప్రభుత్వం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది.

అంతేకాకుండా యూరోపియన్‌ యూనియన్‌ కరోనా పరీక్షలు మరింత విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించింది.మరోపక్క ఐరోపా దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జర్మనీ కూడా మరోసారి లాక్‌డౌన్‌ ప్రకటించింది.

శనివారం ఒక్కరోజే 19 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి.కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ యూరప్‌ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి.కరోనా కట్టడికి పలు దేశాలు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తుంటే, మరికొన్ని దేశాలు పరిమితమైన ఆంక్షల్ని విధిస్తున్నాయి.

ఫ్రాన్స్‌ నెల రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించింది.ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ దేశంలో కరోనా కేసులు తీవ్రతరమవుతున్నాయని, దానికి తగ్గ స్థాయిలో ఆస్పత్రి సదుపాయాలు లేవని అందుకే లాక్‌డౌన్‌ మినహా తమ ముందు మరో మార్గం లేదని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తొలి దశలో వణికించిన కరోనా కంటే రెండోసారి మరింత ప్రమాదకరంగా కరోనా విజృంభిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.దేశంలో గురువారం నుంచి మొదలైన లాక్‌డౌన్‌ డిసెంబర్‌ 1 వరకు కొనసాగుతుంది.

అయితే లాక్‌డౌన్‌ నిర్ణయంపై దేశంలోని వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఇక జర్మనీలో బార్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, సినిమా థియేటర్లు మూసివేశారు.

క్రీడల్ని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు.బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు విధిస్తున్నట్టు జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ ప్రకటించారు.

గత పది రోజుల్లోనే జర్మనీలో ఆస్పత్రుల రోగుల సంఖ్య రెట్టింపైందని దేశంలో ఆరోగ్య సంక్షోభం రాకుండా ఉండాలంటే ఈ ఆంక్షలన్నీ తప్పనిసరని మెర్కల్‌ తెలిపారు.అలానే పోర్చుగల్‌ ప్రభుత్వం కూడా దేశ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది.

వారం రోజుల పాటు ప్రయాణాలపై ఆంక్ష లు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.బెల్జియంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ప్రస్తుతం కరోనా కేసులు అత్యధిక స్థాయిలో పెరిగిపోతున్న దేశాల్లో బెల్జియం ముందుంది.చెక్‌ రిపబ్లిక్‌లో కూడా కర్ఫ్యూ విధించారు.

బహిరంగ ప్రదేశాల్లో మాస్కుని తప్పనిసరి చేస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇలా ఒక్కొక్క దేశం మరోసారి లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇతర దేశాలకు ఆందోళన కలిగిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube