తండ్రికే దిమ్మతిరిగె షాకిచ్చిన కొడుకు.. ?

మా అబ్బాయి మంచోడు అని చెప్పే రోజులు పోయాయి.ఎవడి మనస్సులో ఎలాంటి కిరాతకమైన ఆలోచన ఉంటుందో.

 Uttar Pradesh, Ghaziabad, Boy, Blackmail, Father-TeluguStop.com

మనస్సు కఠినంగా మారితే, చెడు తిరుగుళ్లకు బానిస అయితే ఇంకేముంది.మంచి భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్నట్లే.

దీనికి తోడు ప్రతి వారికి అందుబాటులో ఉన్న టెక్నాలజీ.దీనివల్ల జరిగే మంచి దేవుడికి ఎరుక.

చెడు మాత్రం అందరికి ఎరుక.ఇకపోతే ఒక 11 సంవత్సరాల పిల్ల వాడు కన తండ్రినే బ్లాక్‌మెల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆ వివరాలు చూస్తే.

ఉత్తరప్రదేశ్‌లోని, ఘజియాబాద్‌లో నివసిస్తున్న 11 ఏళ్ల బాలుడు యూట్యూబ్‌లో సైబర్‌ క్రైమ్‌ వీడియోలు చూసి కన్న తండ్రినే బ్లాక్‌మెల్ చేశాడు.

అంతే గాక రూ.పది కోట్లు ఇవ్వకుంటే మీ ఫ్యామిలీ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తానంటూ డిమాండ్‌ చేశాడట.

దీంతో హడలిపోయిన ఆ తండ్రి పోలీసులకు కంప్లెంట్ ఇవ్వగా అసలు నిజం భయటపడిందట.5వ తరగతి చదువుతున్న తన కొడుకే ఇలా చేస్తున్నాడని తెలిసిన ఆ తండ్రి దిమ్మ తిరిగిపోయిందట.

ఇక ఆ కుర్రాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా యూట్యూబ్‌లో హ్యాకింగ్‌ వీడియోలతో పాటు ఆన్‌లైన్‌ మోసాలకు సంబంధించిన వీడియోలు చూసి తాను నేర్చుకున్నట్లు చెప్పడంతో అక్కడున్న వారి మతి పోయిందట.అందుకే తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి అంటున్నారు నెటిజన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube