టాలీవుడ్ ప్రముఖ నటీమణులలో ఒకరైన బొంబాయి పద్మ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో డబ్బులు ఎవరు ఇస్తారనే విషయం మనకు తెలియదని అన్నారు.బెజవాడ పోలీస్ స్టేషన్ సినిమాలో నటిస్తే కేవలం 300 రూపాయలు ఇచ్చారని ఇదేంటని అడిగితే అదమ్మా ఇదమ్మా అని అన్నారని ఆమె తెలిపారు.
నాకు ఇద్దరు బాబులు ఒక పాప అని ఆమె వెల్లడించారు.
నేనే పిల్లలను చూసుకునేదానినని ఆమె కామెంట్లు చేశారు.
మా యంగర్ బ్రదర్స్ సినిమాల్లోకి వెళితే అవమానం అని మొదట నన్ను ఆపేశారని ఆమె చెప్పుకొచ్చారు.ఒక బాబు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని బాబు సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి డైరెక్టర్ అయ్యాడని అన్నారు.
పూరీ జగన్నాథ్ గారి ఆఫీస్ గతంలో ఓపెన్ హౌస్ అని ఆయనను కలిసి నాకు వేషం కావాలని అడిగానని ఆమె చెప్పుకొచ్చారు.మన అమాయకత్వాన్ని చూసి పూరీ అర్థం చేసుకున్నారని అమె తెలిపారు.
అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఆంధ్రావాలా సినిమాలలో ఆఫర్లు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు.ఆది రిలీజ్ రోజున ఆంధ్రావాలా షూట్ మొదలైందని ఆమె చెప్పుకొచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ కూర్చున్నారని వేణుమాధవ్ ను తారక్ తో ఫోటో దిగుతానని తీసుకెళ్లవా అని అడగగా వేణు మాధవ్ తీసుకెళ్లి ఏమే.రావే పద్మా అన్నారని నాకు కోపం వచ్చిందని బొంబాయి పద్మ చెప్పుకొచ్చారు.

నేను వెంటనే వస్తున్నాను ఉండరా అని అన్నానని బొంబాయి పద్మ పేర్కొన్నారు.ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్న గొడవైందని ఆమె చెప్పుకొచ్చారు.ఇదే విషయంలో బ్రహ్మానందంతో గొడవ జరిగిందని ఆమె అన్నారు. బొంబాయి అని నన్ను కామెంట్ చేయడం కొన్నిసార్లు నాకు చిరాకు తెప్పించిందని బొంబాయి పద్మ తెలిపారు.