జాతీయస్థాయిలో బలాబలాల ను తేల్చుకుంటున్న జాతీయ పార్టీలు తమకూటమి బలాన్ని పెంచుకోవడానికి అనుసరించాల్సిన అన్ని వ్యూహాలను పరిశీలిస్తున్నాయి.ప్రస్తుతానికి యూపీఏ కూటమికి సంఖ్యా బలం ఎక్కువగా ఉన్నప్పటికీ తమకు ఉన్న అధికారాన్ని అస్త్రంగా ఉపయోగించి తమ బలాన్ని పెంచుకోవడానికి ఎన్ డి ఏ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.
అందులో భాగంగానే తమ పాత ఎన్డీఏ మిత్రులతో పాటు చిన్న చిన్న పార్టీలను కూడా కలుపుకునే ప్రయత్నాలకు బిజెపి తెర తీసింది .
అంతేకాకుండా ఇప్పుడు భాజాపాకు( BJP party ) వ్యతిరేకంగా యూపీఏ కూటమికి మద్దత్తు ఇస్తున్న కీలక నేతలను టార్గెట్ వారిని బలహీన పరిచే చర్యలకు తెర తీసింది .ఆ దిశగా ఇప్పటికే ఎన్సిపి లో ముసలాన్ని ప్రోత్సహించి ఆ పార్టీ ముక్కలవడం లో తమ వంతు పాత్ర పోషించిన బాజాపా ఇప్పుడు మరాఠయోధుడు శరద్ పవర్ వర్గం మద్దతును కూడా కూడగట్టుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే పార్టీని చీల్చడం ద్వారా ఆయన బలాన్ని తగ్గించిన భాజపా తమతో కలిసి వస్తే పార్టీపై అధికారాన్నితిరిగి అప్పగిస్తామని, కీలక పదవులు ఇస్తామని ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ దిశగా ఇప్పటికే తన చిన్నాన్న ను కలిసి భాజపా వ్యవహారాన్ని వివరించి చెప్పిన అజిత్ పవార్( Ajit Pawar ) 24 గంటలు గడవక ముందే మరొకసారి ఆయనను కలిశారు .
ఈరోజు బెంగుళూరులో జరగబోయే యుపిఏ ప్రతిపక్ష పార్టీల కూటమి సమావేశానికి హాజరవ్వకుండా శరద్ పవార్ ని నిలువరించడమే లక్ష్యంగా అజిత్ సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.మరి విభజన రాజకీయాలు చేసే భాజాపాకు ఎట్టి పరిస్థితులలోనూ మద్దతు ఇవ్వమని ఇంతకుముందే తేల్చేసిన శరద్ పవార్( Sharad Pawar ) సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.అయితే శరద్ పవార్ బలాన్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్న అజిత్ శరద్ పవార్ కి ఏ రకమైన ఆప్షన్స్ ఇవ్వలేదని పార్టీపై తిరిగి పట్టు కావాలంటే తాము చెప్పినట్లు నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది.
జీవితాంతం తనకు మాత్రమే సొంతమైన చాణక్యం తో వ్యూహాలు అమలుచేసి తన రాజకీయ ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేసిన మరఠా యోధుడు చివరి దశలో ఒత్తిడికి తలొగ్గుతాడో లేదో చూడాలి.