ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల తరువాత చంద్రబాబును( Chandrababu ) అసలు దగ్గరకు రానివ్వని బీజేపీ అగ్రనాయకత్వం, ఇప్పుడు చంద్రబాబు తప్పా వేరే ఆప్షన్ లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.దీనికి కారణం కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమి చవిచూడడమే.
ఈ ఓటమి తరువాత బీజేపీలో చాలానే మార్పు వచ్చింది.దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కూడా చేజారిపోవడంతో సౌత్ లో బీజేపీ( BJP ) అంతరించిపోయే ప్రమాదం ఉందనే భయం కమలనాథులలో గట్టిగా కనిపిస్తోంది.
అందుకే కమలం పట్టు దక్షిణాదిన నిలుపుకోవాలంటే ఒక మెట్టు కిందికి దిగడమే మంచిదనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే నిన్న మొన్నటి వరకు చంద్రబాబుతో కలిసే ప్రసక్తే లేదని చెబుతూ వచ్చిన కమలనాథులు ఇప్పుడు చంద్రబాబుతో మంతనాలు జరుపుతున్నారు.
ఇటీవల చంద్రబాబు డిల్లీలో అమిత్ షా( Amit Shah ) తో బేటీ అయిన సంగతి తెలిసిందే.ఈ భేటీలో ప్రధానంగా పొత్తుల అంశమే చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఏపీలో వైసీపీని ఓడించాలంటే 2014 కూటమి ఒక్కటే మార్గమని భావించిన చంద్రబాబు, జనసేన, బీజేపీలను కలుపుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.టీడీపీతో( TDP ) కలవడానికి జనసేన సిద్దంగానే ఉన్నప్పటికి బీజేపీ మాత్రం నిన్నమొన్నటి వరకు ససేమిరా అంటూ వచ్చింది.
కానీ ఇప్పుడు టీడీపీతో కలిస్తేనే మేలు అనే ఆలోచనలోకి వచ్చింది.ఒకవేళ బీజేపీ నిజంగానే టీడీపీతో కలిస్తే.అందులో కమలనాథులు వేరే లాభాన్ని కూడా కోరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
కర్నాటక ఓటమి తరువాత తెలంగాణ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి.అందువల్ల ఈ ఎన్నికల్లో సత్తా చాటలంటే టీడీపీ బలం కూడా అవసరమౌతుంది అని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందట.తెలంగాణ తెలంగాణలో చాలా నియోజిక వర్గాలలో టీడీపీ కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో టీడీపీతో కలిస్తే టీడీపీ ఓటు బ్యాంకు అంతా బీజేపీ వైపు మల్లుతుందనేది కమలనాథుల మాస్టర్ ప్లాన్.
టీడీపీతో కలిస్తే అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ రెండు రాష్ట్రాలలో బీజేపీకి మంచి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు కమలనాథులు.మరి ప్రస్తుతం మంతనాల దశలోనే ఉన్న ఇరు రెండు పార్టీల పొత్తు ఎప్పుడు అధికారికంగా బహిర్గతం అవుతుందో చూడాలి.