ఇటీవల ఆ సినిమాల ప్రమోషన్స్ అనేవి చాలా కామన్ అయిపోయింది సినిమా వస్తుందంటే చాలు పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ట్రైలర్ రిలీజ్ అయి సినిమా రిలీజ్ చేసే వరకు అన్నిటికీ ప్రమోషన్స్ కావాలి ఇక సినిమాకి ముందు ప్రమోషన్ ఇంటర్వ్యూ అయితే కంపల్సరీ.రిలీజ్ తేదీకి ఒక వారం ముందు నుంచే మొదలయ్య ఈ హడావిడి కుదిరినన్ని ప్రమోషన్ ఇంటర్వ్యూస్ తో అలాగే ఫ్యాన్స్ మీటింగ్స్ తో యూట్యూబ్ ప్రమోషన్స్ తో కుదిరితే రీల్స్ లేదంటే లాస్ట్ కి ప్రాంక్లను కూడా వదలడం లేదు సినిమా స్టార్స్ ఇలా అన్ని రకాలుగా వారి సినిమాని పబ్లిసిటీ చేసుకుంటున్నారు.
ఇక ఎన్నో ఏళ్లుగా సినిమాకి ముందు ప్రమోషన్ ఇంటర్వ్యూ చేయడం అనేది కామన్ గా మారిపోయింది దాదాపుగా అన్ని ఇంటర్వ్యూస్ కూడా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా యాంకర్స్ ఉండాల్సిందే అయితే ఈ పద్ధతికి చరమగీతం పాడుతున్నాడు బిత్తిరి సత్తి. అదనంగా ఇంతకుముందు సుమాకి డేట్స్ ఖాళీ లేకపోతే మాత్రమే వేరే అంకర్స్ కి అవకాశం ఇచ్చేవారు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే చెప్పాలి ఖచ్చితంగా సుమ ఉన్న లేకపోయినా తమ ప్రమోషన్ ఇంటర్వ్యూకి అన్కరింగ్ చేయడానికి బిత్తిరి సత్తి కావాలంటూ చిత్ర యూనిట్ కోరడం ఇటీవల కనిపిస్తున్న మాట.

సర్కారు వారి పాట, అంటే సుందరానికి, పక్కా కమర్షియల్, ఆర్ ఆర్ ఆర్, ఎఫ్ త్రీ, జయమ్మ పంచాయతీ, దివారియర్ ఇలా ప్రతి చిత్రం కూడా బిత్తిరి సత్తి ప్రమోషన్స్ ద్వారానే విడుదలై విజయాన్ని సాధించాయి అలాగే ప్రశ్నించే తీరుతో యాసతో ఇంటర్వ్యూ ని హైలెట్ చేయడం బిత్తిరి సత్తి స్పెషలిటీగా మారిపోయింది.వారి పాట సమయంలో మహేష్ బాబు తో జరిగిన ఇంటర్వ్యూ ఎందుకు ఉదాహరణ బిత్తిరి సత్తి ప్రశ్నలకు మహేష్ బాబు పడి పడి నవ్వడం చూసి అభిమానులంతా కూడా ఫిదా అయిపోయారు.ఆ సినిమా తర్వాత చాలామంది స్టార్ హీరోలు తమ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ బిత్తిరి సత్తి చేయాలని అడుగుతున్నారు.

న్యూస్ చానల్స్ లో యాంకరింగ్ తో మొదలైన బిత్తిరి సత్తి కెరియర్ ఆ తర్వాత యూట్యూబ్, ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ తో సంబంధాల వరకు వెళ్ళింది.అంతేకాదు బిత్తిరి సత్తికి అనేక సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో అందరిదీ కడుపుబ్బాని నవ్విస్తూ ఉన్నాడు సత్తి.ఇక తన ఇంటర్వ్యూలు సక్సెస్ కావడంతో తన పారితోషకం కూడా చేశాడట సాధారణంగా ఒక ఇంటర్వ్యూ కోసం సుమ దాదాపు రెండు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తుంది ఇంతకుముందు 50,000 లేదా 60000 ఛార్జ్ చేసే బిత్తిరి సత్తి ఇప్పుడు ఏకంగా లక్షకు పైగా చార్జ్ చేస్తున్న కూడా చిత్రబంధం పరవాలేదు అతడే కావాలని అడుగుతున్నారట.