తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమం ప్రస్తుతం పదవ వారం కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈవారం కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి టాస్కులు లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి పంపిస్తుండడంతో పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది.
ఇదివరకే శివాజీ, అర్జున్, అశ్విని ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చి పెద్ద ఎత్తున సందడి చేశారు.ఇక తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇందులో భాగంగా హౌస్ లోకి గౌతమ్ కృష్ణ ( Gowtham Krishna) తల్లి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇలా ఈమె హౌస్ లోకి రాగానే ఒక్కసారిగా గౌతమ్ తన తల్లిని హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
ఇక ఈమె హౌస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంటెస్టెంట్ తో కూడా సరదాగా మాట్లాడారు ఇక తన కొడుకుకి చెప్పాల్సిన విషయాలన్నింటినీ కూడా అర్థమయ్యేలా వివరించారు.తను చాలా నిజాయితీగా గేమ్ ఆడుతున్నారని ఇలాగే ఆడాలి అంటూ కూడా తనని ప్రోత్సహించారు.అలాగే తనకు బయట అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది అంటూ కూడా చెప్పుకోవచ్చారు.
ఇలా తన కొడుకుతో సరదాగా ముచ్చటించినటువంటి ఈమె హౌస్ లో ఉన్నటువంటి వారందరికీ స్వయంగా తన చేతులతో గోరుముద్దులు తినిపించారు.
ఇలా గౌతమ్ కృష్ణ తల్లి( Gautham Mother ) హౌస్ లోకి రావడంతో యావర్ (Yawar)కాస్త ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే గౌతమ్ కృష్ణ తల్లి తనని హగ్ చేసుకుని నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివే అంటూ తనని ఓదార్చారు.ఈ విధంగా గౌతమ్ కృష్ణ తల్లి హౌస్ లోకి రావడంతో గౌతమ్ తో పాటు యావర్ కూడా కాస్త ఎమోషనల్ అవుతూ ఏడవడంతో ఈ ప్రోమో అందరిని కూడా ఆకట్టుకుంది.
ఇక మిగిలిన కంటెస్టెంట్లకు వారి ఫ్యామిలీ నుంచి ఎవరెవరు రాబోతున్నారు అనేది తెలియాలి అంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.ఇలా ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వెళ్లడంతో ఈ కార్యక్రమం కూడా ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉందని చెప్పాలి.