బిగ్ బాస్ సీజన్ 7 నాలుగవ వారంలో భాగంగా నాగార్జున( Nagarjuna )హౌస్మెట్లతో మాట్లాడుతూ తన స్టైల్ లో కంటెస్టెంట్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.ముఖ్యంగా సంచాలక్ గా వ్యవహరిస్తున్నటువంటి ఆట సందీప్ ( Aata Sandeep )శివాజీల పై నాగార్జున ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ముఖ్యంగా స్మైల్ ప్లీజ్ టాస్క్ లో భాగంగా తేజ గౌతమ్ మెడ పై తాడు వేసి లాగడం గురించి ప్రశ్నించారు.ఈ విషయంపై సందీప్ ను ప్రశ్నిస్తూ నువ్వు ఏమైనా గుడ్డోడివా కళ్ళ ముందు అలా జరుగుతున్న కనిపించడం లేదా ఆ సమయంలో నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అంటూ తన స్టైల్ లో తనకు ఇచ్చి పడేశారు.
ఇదే టాస్క్ లో భాగంగా శివాజీ ఫోటోలు తీస్తూ ఉండగా కెమెరా లో నుంచి చూస్తున్న నీకు ఏం జరుగుతుందో కనిపించట్లేదా ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అంటూ శివాజీ పై కూడా ఫైర్ అయ్యారు.ఇలా కంటెస్టెంట్లు అందరితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు హౌస్ మేట్స్ అయినటువంటి శివాజీ శోభా శెట్టి ( Shobha Shetty ) ఆట సందీప్ ఈ ముగ్గురిలో ఎవరు అనర్హులనుకుంటున్నారు అనే విషయం గురించి మిగతా కంటెస్టెంట్లను నాగార్జున ప్రశ్నిస్తూ కన్ఫెషన్ రూమ్ లోకి ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ వారి నుంచి సమాధానాలు అడిగి తెలుసుకున్నారు.ఇలా నాగార్జున పిలిచి అడగడంతో శివాజీ( Shivaji ) అలాగే ఆట సందీప్ ఇద్దరిని చెరో ముగ్గురు నామినేట్ చేశారు.
బయటకు వచ్చిన తర్వాత మరోసారి అందరిని అడగగా ఆట సందీప్ కు మూడు ఓట్లు రాగా శివాజీకి 6 ఓట్లు వచ్చాయి.ఈయన హౌస్ మేట్ గా అనర్హులు అంటూ ఎక్కువగా ఓట్లు రావడంతో నాగార్జున శివాజీ నుంచి పవర్ ఆస్త్రా ను వెనక్కి తీసుకోవడంతో ఆయన హౌస్ మేట్ నుంచి తిరిగి కంటెస్టెంట్ గా మారిపోయారు.ఇలా ఈయన హౌస్ మేట్ గా అనర్హులు అని బిగ్ బాస్( Bigg Boss )ప్రకటిస్తూ పవర్ అస్త్రా తీసుకొని ఆయనకు మంచిగా బుద్ధి చెప్పారు అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఇంతటితో శనివారం ఎపిసోడ్ పూర్తి అయ్యింది.ఇక ఆదివారం నామినేషన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లలో రతిక ఎలిమినేట్( Rathika Elimination ) అవుతుందని తెలుస్తోంది.